PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena6e9297cb-9a44-43a3-8ad3-502c5b7fe482-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janasena6e9297cb-9a44-43a3-8ad3-502c5b7fe482-415x250-IndiaHerald.jpgమిత్రపక్షం అయిన జనసేన పార్టీకి బీజేపీ పార్టీ ఈ ఉప ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక పార్లమెంట్ సీటు నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ సీటు బీజేపీకే ఉపయోగకరమని భావించి జనసేన ఇప్పటివరకు తిరుపతిలో ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. తద్వారా బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వటమే కాకుండా జనసేన సపోర్ట్ తో ఈ సీటుని ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.janasena;tiru;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;rewati raman singh;rtc;janasena;y. s. rajasekhara reddy;congress;mp;district;tirupati;chief minister;loksabha;parliment;minister;husband;central government;janasena party;march;reddy;v;partyతిరుపతి ఉపఎన్నికల బరిలో జనసేన నిలవటం లేదా?తిరుపతి ఉపఎన్నికల బరిలో జనసేన నిలవటం లేదా?janasena;tiru;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;mohandas karamchand gandhi;rewati raman singh;rtc;janasena;y. s. rajasekhara reddy;congress;mp;district;tirupati;chief minister;loksabha;parliment;minister;husband;central government;janasena party;march;reddy;v;partySun, 13 Dec 2020 05:30:00 GMTఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక విజయం అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలో అనూహ్య రీతిలో సీట్లు గెలుపు వంటి విషయాలు బీజేపీ పార్టీని ఉత్సాహపరిచాయి. ఇక అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికనే టార్గెట్‌గా పెట్టుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దుర్గాప్రసాద్ అకాల మరణం కారణంగా జరగనున్న ఈ ఉప ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తిరుపతిలోని విజయం సాధించి ఏపీలోనూ పాగావేయాలని బీజీపీ చూస్తోంది. ఇందుకు గాను ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుపతిలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభ ఉపన్యాసం చేశారు అలాగే వారితో పాటుగా ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, జాతీయ ఉపాధ్యక్షులు రమణ్ సింగ్, కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యులు వి.మురళీధరన్ పాల్గొని ప్రసంగించారు.



 
 ఈ సందర్భంగా మాజీ సీఎం రమణ్ సింగ్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం కేంద్ర పథకాలకు నవరత్నాలు అని పేరు మార్చి అందిస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉద్దేశించి ఆన్‌లైన్‌లో రమణ్ సింగ్ ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పాలన రావడం ఖాయమని స్పష్టం చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్‌ల విషయంలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి ప్రజలను ఆకర్షించేందుకు నగరంలో బీజేపీ శోభాయాత్ర నిర్వహించనుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు శోభాయాత్ర ఉంటుంది. శోభాయాత్రలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రపక్షం అయిన జనసేన పార్టీకి బీజేపీ పార్టీ ఈ ఉప ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక పార్లమెంట్ సీటు నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ సీటు బీజేపీకే ఉపయోగకరమని భావించి జనసేన ఇప్పటివరకు తిరుపతిలో ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. తద్వారా బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వటమే కాకుండా జనసేన సపోర్ట్ తో ఈ సీటుని ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.




ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>