PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona48b13362-ef8e-4db8-b25e-7e7c49d2a5fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona48b13362-ef8e-4db8-b25e-7e7c49d2a5fc-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ఒక మాయలాడి. దానికి ఆ పేరు అందుకే పెట్టారేమో. అది చేసే మాయ అంతా ఇంతా కాదు, లేదు అనుకుంటే ఉంటుంది. అలా ఇలా కాకుండా వీర విహారం చేస్తుంది. ఇపుడు కరోనా తగ్గింది. ముఖ్యంగా ఏపీలో కరోనా బాగా తగ్గుముఖం పడుతోంది. ఒకపుడు రోజుకు పది వేల దాకా వచ్చిన కేసులు ఇపుడు కేవలం అయిదు వందలకు పరిమితం అయ్యాయి. ఒకపుడు రోజులు వందకు పైగా మరణాలు నమోదు అయితే ఇపుడు పది లోపే ఉంటున్నాయి. carona;maya;kerala;delhi;andhra pradesh;january;festival;december;september;panjaaఏపీలో కరోనా సెకండ్ వేవ్...?ఏపీలో కరోనా సెకండ్ వేవ్...?carona;maya;kerala;delhi;andhra pradesh;january;festival;december;september;panjaaSun, 13 Dec 2020 10:00:00 GMTమాయ అంతా ఇంతా కాదు, లేదు అనుకుంటే ఉంటుంది. అలా ఇలా కాకుండా వీర విహారం చేస్తుంది. ఇపుడు కరోనా తగ్గింది. ముఖ్యంగా ఏపీలో కరోనా బాగా తగ్గుముఖం పడుతోంది. ఒకపుడు రోజుకు పది వేల దాకా వచ్చిన కేసులు ఇపుడు కేవలం అయిదు వందలకు పరిమితం అయ్యాయి. ఒకపుడు రోజులు వందకు పైగా మరణాలు నమోదు అయితే ఇపుడు పది లోపే ఉంటున్నాయి.

అయితే ఈ సంబరం మూడు నాళ్ళ ముచ్చట మాత్రమేనని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ మీద హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల ఉదాహరణలు తీసుకుని మరీ ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది. అక్కడ కూడా మొదట్లో కరోనా వీర విహారం చేసింది. ఆ తరువాత కొద్ది నెలలు ఆగింది. ఇపుడు మళ్ళీ గట్టిగానే పంజా విసురుతోంది.

ఈ నేపధ్యంలో ఏపీలో కూడా ఆగస్ట్ సెప్టెంబర్ నెలల మధ్య కరోనా తీవ్ర రూపం దాల్చింది. అప్పట్లోనే రోజుకు పది వేల పై చిలుకు కేసులు వచ్చాయి. ఆ తరువాత చూసుకుంటే మాత్రం కరోనా అలా తగ్గుతూ డిసెంబర్ లో నెమ్మదించింది. అయితే చలి తీవ్రత ఎంత పెరిగితే అంతలా కరోనా వీర విహారం చేస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు.

డిసెంబర్ 15 నుంచి ఏపీలో చలి ఎక్కువగా పెరుగుతుంది అని నివేదికలు ఉన్నాయి. దాన్ని అంచనా వేసుకుంటే కరోనా కేసులు  కచ్చితంగా పండుగ వేళ అంటే 2021 జనవరి 15 నుంచి మళ్ళీ పీక్స్ కి చేరే అవకాశాలు ఉంటాయని లెక్కలు కడుతున్నారు. ఈ తీవ్రత  మొదటి సారి వచ్చిన దాని కంటే కూడా ఎక్కువగానే ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి కరోనా  సెకండ్ వేవ్ హెచ్చరికలతో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తం అయింది. వైద్య నిపుణులతో కమిటీని కూడా వేసి మానిటరింగ్ చేస్తోంది.




హిట్ సినిమాలు చేస్తున్నా నభా స్టార్ అవలేకపోతుందా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>