MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshd39dba5e-cd44-44fd-8f3f-ed1561986e41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshd39dba5e-cd44-44fd-8f3f-ed1561986e41-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద సక్సెస్ నందుకొని తొలి సినిమాతోనే మహేష్ కి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుని కొనసాగిన మహేష్ ఆపై కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనున్న mahesh babu;sarkaaru vaari paata;mahesh;namrata shirodkar;manu;nandu;rajaka;tollywood;cinema;rajani kanth;smart phone;interview;blockbuster hit;cheque;makeup;success;college;nijamమాటలు కాదు .... ఏకంగా చేతల్లో చేసి చూపించడం మహేష్ బాబు గొప్పతనం ....!!మాటలు కాదు .... ఏకంగా చేతల్లో చేసి చూపించడం మహేష్ బాబు గొప్పతనం ....!!mahesh babu;sarkaaru vaari paata;mahesh;namrata shirodkar;manu;nandu;rajaka;tollywood;cinema;rajani kanth;smart phone;interview;blockbuster hit;cheque;makeup;success;college;nijamSun, 13 Dec 2020 20:41:28 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద సక్సెస్ నందుకొని తొలి సినిమాతోనే మహేష్ కి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుని కొనసాగిన మహేష్ ఆపై కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే.
ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకని హ్యాట్రిక్ కొట్టిన మహేష్ ఈ సర్కారు వారి పాటతో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఎప్పుడూ తన కుటుంబ సభ్యులు స్నేహితులు అందరితో కూడా ఎంతో సరదాగా వ్యవహరిస్తూ ఉండే మహేష్ బాబు తన వద్ద పని చేసే వారికి కూడా వీలైనంతలో సాయం చేస్తూ గొప్ప మనసు సంపాదించుకున్నారు. ఇక కొన్నేళ్ళ క్రితం నుండి ఆయనకు పర్సనల్ మేకప్ మెన్ గా పట్టాభి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు ఒక ప్రముఖ తెలుగు  పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా పట్టాభి మాట్లాడుతూ, మహేష్ ను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నానని మొదటి నుంచి అందరితోనూ ఎంతో కలుపుగోలుగా వ్యవహరించి మహేష్ పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగివుంటారని, నాటి బాలనటుడి నుండి నేటి సూపర్ స్టార్ వరకు ఆయన కు క్రేజ్ భారీగా పెరగడంతో పాటు కెరీర్లో మార్పు వచ్చింది తప్ప ఆయన వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు రాలేదని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది అని చెప్పుకొచ్చారు పట్టాభి.

ఇక ఒకానొక సమయంలో తన కుమారుడి కాలేజీ సీటు విషయమై మహేష్ తో మాట్లాడితే అది విన్న మహేష్ బాబు ఏ కాలేజీలో చేర్పిస్తున్నారు అని అడిగి ఊరుకున్నారని అయితే అనంతరం వెంటనే కొంతసేపటికి నమ్రత గారి నుండి ఫోన్ వచ్చిందని ఆపై మహేష్ నుండి వచ్చిన ప్రత్యేక చెక్ ని చూసిన తనకి నిజంగా ఆశ్చర్యం వేసింది అని చెప్పుకొచ్చారు పట్టాభి. నిజానికి తన కుమారుడి కాలేజీ చదువు కోసం తాను మహేష్ ని డబ్బు అడిగితే మీరు నాకు ఒక మాట ఇస్తే డబ్బు ఇస్తాను అని మహేష్ అన్నారని, అదేమిటంటే మీ అబ్బాయి ని బాగా చదివించండి చాలు, కాకపోతే మీరు ఈ డబ్బు నాకు ఎప్పటికీ తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పిన మహేష్ మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేని తన దగ్గర పనిచేసే ఉద్యోగులను కూడా తన సొంత మనుషులు గా భావించే మహేష్, నమ్రతలు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పట్టాభి చెప్పారు.....!!




వార్ని .... పాటొచ్చి పాతికేళ్ళు దాటినా ....దాని పవర్ మాత్రం ఇంకా తగ్గలా .... ??

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>