Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/tantrik6312afd4-6634-4abb-ae2f-5ae5a544ff98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/tantrik6312afd4-6634-4abb-ae2f-5ae5a544ff98-415x250-IndiaHerald.jpgడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లేది తల్లి. కానీ ఓ తల్లి మాత్రం కన్న బిడ్డనే కర్కశంగా కడతేర్చింది. కంటికి కనపడని శక్తులు ఏవో వశం అవుతాయన్న మూఢ నమ్మకంతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అమానుషంగా హతమార్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో...tantrik;geetha;jeevitha rajaseskhar;west bengal - kolkata;district;police;capital;ghee;arjun 1కన్న బిడ్డను కడతేర్చి.. కర్పూరం, నెయ్యి పూసి...కన్న బిడ్డను కడతేర్చి.. కర్పూరం, నెయ్యి పూసి...tantrik;geetha;jeevitha rajaseskhar;west bengal - kolkata;district;police;capital;ghee;arjun 1Sun, 13 Dec 2020 11:20:58 GMTకోల్‌కతా: బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లేది తల్లి. కానీ ఓ తల్లి మాత్రం కన్న బిడ్డనే కర్కశంగా కడతేర్చింది. కంటికి కనపడని శక్తులు ఏవో వశం అవుతాయన్న మూఢ నమ్మకంతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అమానుషంగా హతమార్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జరిగింది. ప్రపంచం మొత్తం 22వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్నా.. కొందరు మాత్రం ఇప్పటికీ మూఢ నమ్మకాలతో అంధ విశ్వాసాలతో సైకోలుగా మారుతున్నారు. ఏవో అతీంద్రియ శక్తుల కోసం తమ వారి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది కలకత్తాకు చెందిన గీత.

గీత, తన ఇద్దరు పిల్లలు.. అర్జున్(25), విదుర్(20)లతో ఉత్తర 24 పరగణాల జిల్లా బిధాన్నగర్‌లో నివశిస్తోంది. చెట్టంత కొడుకు, ప్రశాంతమైన జీవితం. కానీ ఆమెకు ఇంకా ఏదో కావాలనిపించింది. కొడుకును బలిస్తే అతీంద్రియ శక్తులు సాధించవచ్చని ఎవరో చెబితే గుడ్డిగా నమ్మేసింది. ఆ శక్తుల కోసం పెద్ద కొడుకు అర్జున్‌(25)ను చంపేందుకు సిద్ధమైంది. దీనికోసం చిన్న కొడుకు సాయం కోరింది. అతడు కూడా దానికి అంగీకరించాడు. ముందుగా అనుకున్నట్లుగానే బయటి నుంచి అర్జున్ ఇంటికి రాగానే వెనక నుంచి తమ్ముడు అతడిని పట్టుకున్నాడు. ఇంతలో గీత రోకలిబండ తీసుకువచ్చి అతడి తలపై మోదింది. అసలు తనను ఎందుకు చంపాలనుకుంటున్నారని అడిగే సమయం కూడా అర్జున్‌కు దక్కలేదు. ఒక్కసారిగా నేలకూలిపోయాడు. కన్న తల్లి, తమ్ముడే తనను చంపేశారన్న బాధతోనే ఊపిరొదిలేశాడు.

మృతదేహం ఇంట్లో ఉంటే వాసన వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు కూడా గీత ప్లాన్ ఆలోచించి పెట్టుకుంది. అర్జున్ శవానికి నెయ్యి, కర్పూరం, మసాలాలు పూసి.. ఇంట్లోనే దహనం చేసింది. విషయం పోలీసులకు తెలియడంతో నిందితులురాలు గీత, ఆమె చిన్న కుమారుడు విదుర్‌ను అరెస్టు చేశారు. కొడుకును చంపడానికి గల కారణం విని పోలీసులు కూడా కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.





మహేశ్ డైరెక్టర్ ఆ సినిమా మొదలు పెట్టనున్నాడా ?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>