MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actress-lakshmibeb952f1-c08d-4674-a2b6-92e5ec10d068-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/actress-lakshmibeb952f1-c08d-4674-a2b6-92e5ec10d068-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమ దేశం... మెచ్చే ఎంతో మంది నటీనటులను అందించింది. వీరిలో స్టార్స్ ఉన్నారు. సహజ నటనతో ప్రేక్షకులను మాయ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అలాంటి సహజ నటి అనగానే లక్ష్మి ఎర్రగుడిపాటి పేరు ముందుగా గుర్తుకి వస్తుంది.actress lakshmi;mahesh;aishwarya;ananth nag;bhaskar;editor mohan;jeevitha rajaseskhar;lakshmi;manu;maya;rani;industries;cinema;baba bhaskar;tamil;marriage;kannada;film industry;lakshmi devi;v;murari;anant nagపేరుకే మూడు పెళ్లిళ్లు..కానీ నటి లక్ష్మి జీవితం నిండా కష్టాలే..!పేరుకే మూడు పెళ్లిళ్లు..కానీ నటి లక్ష్మి జీవితం నిండా కష్టాలే..!actress lakshmi;mahesh;aishwarya;ananth nag;bhaskar;editor mohan;jeevitha rajaseskhar;lakshmi;manu;maya;rani;industries;cinema;baba bhaskar;tamil;marriage;kannada;film industry;lakshmi devi;v;murari;anant nagSun, 13 Dec 2020 11:00:00 GMTపరిశ్రమ దేశం...  మెచ్చే ఎంతో మంది నటీనటులను అందించింది. వీరిలో స్టార్స్ ఉన్నారు. సహజ నటనతో ప్రేక్షకులను మాయ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అలాంటి సహజ నటి అనగానే లక్ష్మి ఎర్రగుడిపాటి పేరు ముందుగా గుర్తుకి వస్తుంది.
లక్ష్మీ తల్లి తండ్రులు వై.వి.రావు, వై.రుక్మిణి. వీరిది అచ్చమైన తెలుగు తెలుగు బ్రాహ్మణ కుటుంబం. లక్ష్మీ 1952, డిసెంబరు 13 న చెన్నైలో జన్మించింది. ఈమె మొదటి చిత్రం  1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". ఇక 1970లలో లక్ష్మీ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. అప్పట్లో 1975లో విడుదలైన జూలీ మూవీలో నటించి తన సత్తా చాటుకుంది లక్ష్మీ.  ఈ మూవీలో  లక్ష్మి నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కడం విశేషం. ఇక అక్కడ నుండి లక్ష్మీకి ఇండస్ట్రీలో  ఎదురు లేకుండా పోయింది. ఈమె తల్లి తండ్రిది కూడా సినిమా నేపధ్యం కావడంతో ఆమెకి అవకాశాలకి కొదవ లేకుండా పోయింది. ఇక 1980లలో దక్షిణాదిన కొత్త కథానాయికల జోరు ఎక్కువైంది.

ఈ నేపధ్యలోనే లక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. సుమారు 400 సినిమాలలో నటించిన తరువాత లక్ష్మీ రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది. అయితే.., అక్కడ అంతగా రాణించలేక మళ్ళీ సినిమాలకే పరిమితం అయిపోయింది. ఈ తరం ప్రేక్షకులకి మాత్రం లక్ష్మీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిచయం. ఈమె.., జీన్స్, మురారి, మిధునం వంటి సినిమాల్లో నటించిన తీరు.., నేటి కథానాయకులకు ఓ పాఠం లాంటిది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీన్స్ సినిమాలో  ఐశ్వర్య మనసు పడ్డ అబ్బాయితో పెళ్లి చేయడానికి.. బామ్మ పాటలో లక్ష్మీ జీవించేసింది. ఇక మురారిలో అయితే.. మహేశ్ బాబు వదినగా ఈమె నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

 ఈ 5 పదుల సినీ ప్రయాణంలో లక్ష్మీ ఇలాంటి అద్భుతమైన పాత్రలను ఎన్నో చేసింది. అయితే రీల్ లైఫ్ లో ఇంత సాధించినా.., రియల్ లైఫ్ లో మాత్రం లక్ష్మీకి ఇబ్బందులు తప్పలేదు. లక్ష్మీకి మూడుసార్లు పెళ్లి జరిగింది.  పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను మనువాడింది. ఈ వివాహ బంధానికి గుర్తుగా   1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. . తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది లక్ష్మీ. ఇక కన్నడ ఆర్టిస్ట్  అనంత్ నాగ్ తో కూడా ఈమె కొన్నాళ్ళు సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే.., ఇంత సుదీర్ఘ ప్రయాణంలో లక్ష్మీ మాత్రం తనకంటూ ఒక శాశ్విత తోడుని ఏర్పరుచుకోలేక పోయింది.


మహేశ్ డైరెక్టర్ ఆ సినిమా మొదలు పెట్టనున్నాడా ?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>