MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prasant8ee1861b-49d4-4299-a684-f7e0019b627f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prasant8ee1861b-49d4-4299-a684-f7e0019b627f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలు ఇపుడు రూట్ మార్చేశారు. ఏకంగా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమా పరిధి ఆ విధంగా ఒక్కసారిగా పెంచేస్తున్నారు. దీంతో క్రేజీ డైరెక్టర్లకు ఆఫర్స్ కూడా వెల్లువలా వస్తున్నాయి. దమ్మున్న కధతో పాన్ ఇండియా కంటెంట్ తో రెడీ అయితే చాలు టాప్ హీరోలు కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు. ఇపుడు ఆ విధంగా క్రేజ్ సాధించిన ఒక క్రేజీ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆయనే ప్రశాంత్ నీల్. ఈ డైరెక్టర్ కేజీఎఫ్ మూవీ తో ఒక్కసారిగా ప్రపంచాన్ని ఊపేశాడు. ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. prasant;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;tollywood;cinema;director;hero;kgf;prasanth neel;prashant kishor;adhursఅటు ప్రభాస్...ఇటు జూనియర్...ఆ డైరెక్టర్ క్రేజ్ అదుర్స్...?అటు ప్రభాస్...ఇటు జూనియర్...ఆ డైరెక్టర్ క్రేజ్ అదుర్స్...?prasant;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;tollywood;cinema;director;hero;kgf;prasanth neel;prashant kishor;adhursSun, 13 Dec 2020 20:30:00 GMTటాలీవుడ్ హీరోలు ఇపుడు రూట్ మార్చేశారు. ఏకంగా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమా పరిధి ఆ విధంగా ఒక్కసారిగా పెంచేస్తున్నారు. దీంతో క్రేజీ డైరెక్టర్లకు ఆఫర్స్ కూడా వెల్లువలా వస్తున్నాయి. దమ్మున్న కధతో పాన్ ఇండియా కంటెంట్ తో రెడీ అయితే చాలు టాప్ హీరోలు కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు. ఇపుడు ఆ విధంగా క్రేజ్ సాధించిన ఒక క్రేజీ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆయనే ప్రశాంత్ నీల్. ఈ డైరెక్టర్ కేజీఎఫ్ మూవీ తో ఒక్కసారిగా ప్రపంచాన్ని ఊపేశాడు. ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.

తనలో ఎంత స్టఫ్ ఉందో ఆ ఒక్క మూవీతో చూపించేశాడు. ఇపుడు ఆ సీక్వెల్ పనిలో బిజీగా ఉన్నాడు. అయితే నాటి నుంచే ప్రశాంత్ నీల్ మీద టాలీవుడ్ టాప్ స్టార్స్ కన్ను పడింది. ఇక ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా కంటెంట్ ని రెడీ చేసిపెట్టుకుని మరీ తన కధకు సరిపడే హీరోల వేటలో ఉన్నాడు. అన్నీ అలా కలసి వచ్చి రెబెల్ స్టార్ ప్రభాస్ లో సలార్ అన్న మూవీని బిగ్ సౌండ్ తో అనౌన్స్ చేశాడు.

దాంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. ప్రభాస్ చేతిలో అప్పటికే రెండు పాన్ ఇండియా మూవీస్ ఉండగానే మూడవదిగా సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ప్రకటించి ప్రత్యర్ధులకు ప్రశాంతత లేకుండా చేశాడు. ఇపుడు  ప్రశాంత్ నీల్ తో మరో  టాప్ హీరో డీల్ కూడా ఉందని తెలుస్తోంది.

ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీయార్. ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుందని ఈ మధ్యంతా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ప్రభాస్ తో ప్రశాంత్ కాంబో అనౌన్స్మెంట్ రావడంతో అంతా ఈ మూవీ లేదేమోనని అనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా కచ్చితంగా ఉందని తాజా టాక్. ఈ మూవీని మైత్రీ మూవీస్ నిర్మిస్తోందిట. ఎన్టీయార్, ప్రశాంత్ నీల్ కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీని పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున మూవీగా తీయడానికి  డిజైన్ చేస్తున్నారుట.

తొందర లోనే  ఆ బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ క్రేజీ డైరెక్టర్ ఒకేసారి ఇద్దరు టాప్ హీరోలతో మూవీస్ చేయడం ద్వారా రానున్న రెండేళ్ళలో తన సత్తా  ఏంటో ఆల్ ఇండియా లెవెల్లో చాటేందుకు రెడీ అవుతున్నాడు అన్న మాట. ఇంకేం. వెయిట్ అండ్ సీ.




అబ్బా .... కేవలం థీమ్ సాంగ్ తోనే తన రేంజ్ ఏంటో చూపించాడుగా ....??

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>