MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-politics-is-very-different2b385b79-a297-4e16-b124-e17117dab225-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-politics-is-very-different2b385b79-a297-4e16-b124-e17117dab225-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్, ఒకరకంగా ఈ పేరు తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అనే చెప్పాలి. అయితే కేవలం మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా హీరోగా తనకంటూ ఎంతో ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇండియా గర్వించదగ్గ గొప్ప నటుడిగా ఎంతో భారీ క్రేజ్, పాపులారిటీతో కొనసాగుతున్నారు. అలానే కొందరు విశ్లేషకులు వెల్లడిస్తున్న వివరాలను బట్టి చూస్తే కోలీవుడ్ స్టార్ అయిన రజిని, బాలీవుడ్ హీరోలు సైతం అందుకోలేనంత భారీ పారితోషికాన్ని తన సినిమాలకు తీసుకుంటున్నట్లు టాక్. rajinikanth;superstar rajini;kamal hassan;shiva;india;bollywood;cinema;rajani kanth;january;kollywood;lord siva;vegetable market;success;partyఇక ఆయన రంగంలోకి దిగాక ... మిగతా వాళ్లంతా బ్యాగులు సర్దుకోవడమే ....??ఇక ఆయన రంగంలోకి దిగాక ... మిగతా వాళ్లంతా బ్యాగులు సర్దుకోవడమే ....??rajinikanth;superstar rajini;kamal hassan;shiva;india;bollywood;cinema;rajani kanth;january;kollywood;lord siva;vegetable market;success;partySun, 13 Dec 2020 05:00:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్, ఒకరకంగా ఈ పేరు తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అనే చెప్పాలి. అయితే కేవలం మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా హీరోగా తనకంటూ ఎంతో ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇండియా గర్వించదగ్గ గొప్ప నటుడిగా ఎంతో భారీ క్రేజ్, పాపులారిటీతో కొనసాగుతున్నారు. అలానే కొందరు విశ్లేషకులు వెల్లడిస్తున్న వివరాలను బట్టి చూస్తే కోలీవుడ్ స్టార్ అయిన రజిని, బాలీవుడ్ హీరోలు సైతం అందుకోలేనంత భారీ పారితోషికాన్ని తన సినిమాలకు తీసుకుంటున్నట్లు టాక్.

అలానే అదే రేంజ్ లో ఆయన సినిమాల బడ్జెట్, మార్కెట్ కూడా ఉంటుంది. ఇక ఇటీవల వరుసగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది. మరోవైపు అతి త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల ప్రకటన చేసిన రజినీకాంత్ ప్రస్తుతం పలువురు తన అనునాయులు, అభిమానులతో కలిసి పార్టీ యొక్క పలు విభాగాలను, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టో వంటి వాటిని సిద్ధం చేస్తున్నట్లు టాక్.

మరోవైపు రజిని పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ప్రకటించిన దగ్గరి నుండి అక్కడి ప్రముఖ పార్టీ లైన డీఎంకే, అన్న డీఎంకే పార్టీల నాయకుల గుండెల్లో అలజడి మొదలవ్వడం, అప్పటినుండి ఆయా పార్టీల నాయకులు అప్పుడప్పుడు రజినీపై కొంత పరోక్షంగా విమర్శలు చేయడం జరుగుతోంది. ఇక ఇటీవల మరొక నటుడు కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పేరు తో ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. కాగా రజిని తన పార్టీని సరిగ్గా 2021, జనవరి 1 న ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలని పలువురు ప్రజలు, నాయకులు ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన పార్టీ ప్రకటన తరువాత జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీ తో విజయం సాధించి తీరుతారని, ఆ తరువాత మిగతా పార్టీలు, ఆయా నాయకులు ఇక బ్యాగులు సర్దుకోవడమే అంటూ పలువురు అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం....!!




తిరుపతి ఉపఎన్నికల బరిలో జనసేన నిలవటం లేదా?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>