PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bandi-sanjay-vs-kishan-reddyf4b9fa88-3ea9-459e-932e-c915036cb5bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bandi-sanjay-vs-kishan-reddyf4b9fa88-3ea9-459e-932e-c915036cb5bd-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాగా హుషారయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్ నుంచి కిషన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. గతంలో కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నా కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యారు. అయితే రాష్ట్ర పార్టీపై బండి సంజయ్ అజమాయిషీ పెరిగిపోవడంతో కిషన్ రెడ్డి త్వరగానే సర్దుకున్నారు. సంజయ్ తనకంటే పైకి ఎదిగే లోపే కట్టడి చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కిషన్ రెడ్డి. kishan reddy;vidyasagar;hyderabad;bharatiya janata party;warangal;telangana;g kishan reddy;hushaaru;minister;central government;reddy;partyబండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి.. ఏదో జరుగుతోంది..?బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి.. ఏదో జరుగుతోంది..?kishan reddy;vidyasagar;hyderabad;bharatiya janata party;warangal;telangana;g kishan reddy;hushaaru;minister;central government;reddy;partySun, 13 Dec 2020 09:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాగా హుషారయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైమ్ నుంచి కిషన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. గతంలో కూడా ఆయన యాక్టివ్ గానే ఉన్నా కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యారు. అయితే రాష్ట్ర పార్టీపై బండి సంజయ్ అజమాయిషీ పెరిగిపోవడంతో కిషన్ రెడ్డి త్వరగానే సర్దుకున్నారు. సంజయ్ తనకంటే పైకి ఎదిగే లోపే కట్టడి చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కిషన్ రెడ్డి.

వరంగల్ పర్యటన ముగియగానే హైదరాబాద్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు కిషన్ రెడ్డి. సనత్ ‌నగర్ ‌ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ సేఫ్‌ ఇంక్యుబేటర్‌, డయాలసిస్‌ సెంటర్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. పేదల కోసం పెద్ద ఎత్తున జనరిక్‌ ఔషధ దుకాణాలను ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సనత్ ‌నగర్‌ ఈఎస్ఐ మెడికల్ కళాశాలను ఆయన సందర్శించారు. కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలను తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడ త్వరలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

దుబ్బాక ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన బండి సంజయ్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఓవైపు కేంద్ర నాయకత్వం వచ్చినా కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రచారం హుషారుగా సాగింది. అసాధ్యమైన హామీలిచ్చినా కూడా సంజయ్ మాటలు గ్రేటర్ బరిలో తూటాల్లా పేలాయి. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ప్రమాణం కోసం వెళ్లిన సంజయ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. తెలంగాణ బీజేపీపై తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే అదే సమయంలో సంజయ్ వ్యవహారం కిషన్ రెడ్డికి కాస్త ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకూ తెలంగాణలో బీజేపీ అంటే కిషన్ రెడ్డి అన్నట్టుగా ఉండేది. సీనియర్లు విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ.. లాంటి వారు ప్రత్యక్ష రాజకీయాలనుంచి కాస్త పక్కకు జరగడంతో కిషన్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అనుకున్నారు. అయితే సంజయ్ సడన్ గా దూసుకొచ్చారు, అందరినీ కలుపుకొని అల్లుకుపోతున్నారు. దీంతో కిషన్ రెడ్డి మళ్లీ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెంచారు.




మ‌ళ్లీ బాలాకోట్‌లో ఉగ్ర‌వాద శిక్ష‌ణ‌... వీడియోలో భార‌త్ గురించి విద్వేషం..

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>