PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/should-the-ap-phase-change-with-that-project88ad00a7-45e9-4271-a922-7ff6757fe289-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/should-the-ap-phase-change-with-that-project88ad00a7-45e9-4271-a922-7ff6757fe289-415x250-IndiaHerald.jpgపెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. పెట్రో కెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ లో భాగంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ అంచనాలు నిజమైతే రాష్ట్రం దేశానికే పెట్రో కెమికల్ హబ్ కానుంది. should the ap phase change with that project;suma;suma kanakala;andhra pradesh;district;vishakapatnam;2020;central government;kakinadaఆ ప్రాజెక్ట్ తో ఏపీ దశ మారనుందా..?ఆ ప్రాజెక్ట్ తో ఏపీ దశ మారనుందా..?should the ap phase change with that project;suma;suma kanakala;andhra pradesh;district;vishakapatnam;2020;central government;kakinadaSun, 13 Dec 2020 18:00:00 GMTకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ అంచనాలు నిజమైతే రాష్ట్రం దేశానికే పెట్రో కెమికల్ హబ్ కానుంది.

2007లో మొదటగా రూపొందిన పీసీపీఐఆర్ పాలసీ వివిధ సందర్భాల్లో మారుతూ వస్తోంది. తాజాగా 2020-35 పీసీపీఐఆర్ పాలసీని సిద్దం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసేందుకు ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. ఇప్పటి వరకు 250చదరపు కిలోమీటర్లకు ఓ క్లస్టర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం దాన్ని 50చదరపు కిలోమీటర్లకు కుదించారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్.

కాకినాడ ఎస్ ఈ జెడ్ సమీపంలో పోర్టు నిర్మాణం లాంటి చర్యలకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రబత్వం. విశాఖ, కాకినాడ, మచిలీ పట్నం లాంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విశాఖ పట్టణం జిల్లా నక్కపల్లిలో ఓ భారీ క్లస్టర్ ఏర్పాటు కానుంది. అలాగే కాకినాడ మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసేదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాకినాడ ఎస్ ఈజెడ్ పరిధిలో 11.43బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు హల్దియా పెట్రో కెమికల్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
గెయిల్ భాగస్వామ్యంతో హెచ్ పీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 1.5మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖ వ్యక్తం చేస్తోంది హెచ్ పీసీఎల్.







నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>