PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd017444c0-5e1b-490d-997b-18b0dac1242c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd017444c0-5e1b-490d-997b-18b0dac1242c-415x250-IndiaHerald.jpgతిరుమల టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే భక్తులను పదే పదే హెచ్చరిస్తున్నారు అధికారులు. అసలైన వెబ్ సైట్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తిరుమల పేరుతో పలు నకిలీ వెబ్ సైట్లు పుట్టుకు రావడం, సోషల్ మీడియాలో అసలు వెబ్ సైట్ కంటే, ఆయా నకిలీ వెబ్ సైట్లకే ఎక్కువ ప్రచారం రావడం కలవరపెట్టే అంశం. భక్తులు కూడా ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఉదాహరణలున్నాయి. అందుకే టీటీడీ అధికారులు ఇలాంటి నకిలీttd;darshana;tiru;andhra pradesh;tirupati;king;king 1;service;tirumala tirupathi devasthanamఆన్ లైన్ లో తిరుమల టికెట్లు బుక్ చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..ఆన్ లైన్ లో తిరుమల టికెట్లు బుక్ చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..ttd;darshana;tiru;andhra pradesh;tirupati;king;king 1;service;tirumala tirupathi devasthanamSun, 13 Dec 2020 07:00:00 GMTతిరుమల టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే భక్తులను పదే పదే హెచ్చరిస్తున్నారు అధికారులు. అసలైన వెబ్ సైట్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తిరుమల పేరుతో పలు నకిలీ వెబ్ సైట్లు పుట్టుకు రావడం, సోషల్ మీడియాలో అసలు వెబ్ సైట్ కంటే, ఆయా నకిలీ వెబ్ సైట్లకే ఎక్కువ ప్రచారం రావడం కలవరపెట్టే అంశం. భక్తులు కూడా ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఉదాహరణలున్నాయి. అందుకే టీటీడీ అధికారులు ఇలాంటి నకిలీ వెబ్ సైట్లపై దృష్టిపెట్టారు. భక్తులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం అందిస్తామ‌ని సోష‌ల్ మీడియాలో న‌కిలీ వెబ్‌సైట్లు చేసుకుంటున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌ొ‌ద్ద‌ని ఈఓ జవహర్‌రెడ్డి భ‌క్తుల‌ను కోరారు. శ్రీ‌వారి భ‌క్తులు టీటీడీ వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.in ను మాత్ర‌మే వినియోగించాలని సూచించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యం కోసం తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, మాధ‌వం వస‌తి స‌ముదాయాల్లోని గదుల‌ను డిసెంబ‌రు 15వ తేదీ నుంచి భ‌క్తుల‌కు కేటాయిస్తున్నట్టు ఆయన చెప్పారు. డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఈ గదుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించామని ఈఓ తెలిపారు.

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు తెరిచి ఉంచబోతున్నారు. వైకుంఠ ద్వార దర్శనంకోసం రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను టీటీడీ ఇటీవల విడుద‌ల చేసింది. కరెంట్ బుకింగ్ ద్వారా పదివేల టికెట్లు ఈ నెల 24న భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా డిసెంబరు 16 నుంచి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో సుప్ర‌భాత సేవ బ‌దులు తిరుప్పావై ప‌ఠ‌నం జ‌రుగుతుంది. శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 14 నుండి జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు అధ్య‌య‌నోత్స‌వాలు జ‌రుగుతాయి. 


పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>