MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh88d4d9f2-ace1-45a3-a613-639c65aa9819-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh88d4d9f2-ace1-45a3-a613-639c65aa9819-415x250-IndiaHerald.jpgబ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా అదృష్టం లేక రాణించలేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో దగ్గుబాటి రాజా ఒకరు. దగ్గుబాటి రాజా అంటే మనకి తెలియకపోవచ్చు. కానీ గూగుల్ తల్లిని ఓపెన్ చేసి దగ్గుబాటి రాజా అని కొడితే ఆయన హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. తెలుగులో కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించడం వల్ల మనకి పెద్దగా తెలియదు.venkatesh;chiranjeevi;ntr;venkatesh;balakrishna;nageshwara rao akkineni;raja;rani;tara;tollywood;2019;cinema;telugu;google;tamil;writer;producer;producer1;hero;daggubati venkateswara rao;letter;nandamuri taraka rama rao;satyanandహీరో వెంకటేష్ సొంత బాబాయ్ స్టార్ యాక్టర్ ..అతనెవరో తెలుసా..?హీరో వెంకటేష్ సొంత బాబాయ్ స్టార్ యాక్టర్ ..అతనెవరో తెలుసా..?venkatesh;chiranjeevi;ntr;venkatesh;balakrishna;nageshwara rao akkineni;raja;rani;tara;tollywood;2019;cinema;telugu;google;tamil;writer;producer;producer1;hero;daggubati venkateswara rao;letter;nandamuri taraka rama rao;satyanandSun, 13 Dec 2020 16:07:34 GMTసినిమా ఇండస్ట్రీలోసినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే స్టార్లయిపోతారనుకుంటే పొరపాటే. ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా గాని టాలెంట్ కూడా ముఖ్యమే. టాలెంట్ లేకపోతే జనం నెత్తిన అస్సలు పెట్టుకోరు  ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే స్టార్లయిపోతారనుకుంటే పొరపాటే. ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా గాని టాలెంట్ కూడా ముఖ్యమే. టాలెంట్ లేకపోతే జనం నెత్తిన అస్సలు పెట్టుకోరు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచైనా, అక్కినేని ఫ్యామిలీ నుంచైనా, నందమూరి వంశం నుంచైనా... ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా నిలబడేది కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే. నిలబడ్డది కూడా టాలెంట్ ఉండబట్టే అన్న విషయం మర్చిపోకూడదు. అయితే ఈ టాలెంట్ కి కూసింత అదృష్టం కూడా తోడవ్వాలండోయ్. అదే లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా తలరాత మారదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా అదృష్టం లేక రాణించలేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో దగ్గుబాటి రాజా ఒకరు. దగ్గుబాటి రాజా అంటే మనకి తెలియకపోవచ్చు. కానీ గూగుల్ తల్లిని ఓపెన్ చేసి దగ్గుబాటి రాజా అని కొడితే ఆయన హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. తెలుగులో కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించడం వల్ల మనకి పెద్దగా తెలియదు.

అయితే అప్పట్లో రచయిత సత్యానంద్ దర్శకత్వంలో వచ్చిన ఝాన్సీరాణి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యారు రాజా. ఆ సినిమాతో దగ్గుబాటి రాజాకి మంచి పేరు వచ్చింది కానీ తెలుగులో హీరోగా నిలదొక్కుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేశారు. దగ్గుబాటి రాజా, రామనాయుడికి దగ్గర బంధువు..వరుసకి తమ్ముడు అవుతారు. విక్టరీ వెంకటేష్ కి బాబాయ్ అవుతారు. అప్పట్లో రాజా నటించిన కొన్ని సినిమాలకు రామానాయుడు సహనిర్మాతగా వ్యవహరించి సపోర్ట్ చేశారు. కానీ అదృష్టం అతన్ని వరించలేదు. అందుకే ఆయన హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. 2019 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయినటువంటి ఎన్.త్రివిక్రమరావు పాత్రలో నటించారు. ఇలా తెలుగు, తమిళ భాషల్లో నటించిన రాజా, అదృష్టం లేక నిలదొక్కుకోలేకపోయారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా గాని కాలం కలిసి రాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకూ ఉందన్నది మేటర్ కాదు, టాలెంటు, అదృష్టం ఎంత మోతాదులో ఉందన్నదే ముఖ్యం.


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>