KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children898cf214-867f-493d-81b2-d0401c0cb50a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children898cf214-867f-493d-81b2-d0401c0cb50a-415x250-IndiaHerald.jpgపిల్లలకు బ్యాలెన్స్‌‌డ్‌‌ డైట్‌‌ చాలా ముఖ్యం. తగినన్ని న్యూట్రియెంట్స్‌‌, విటమిన్స్‌‌ సరిగ్గా అందినప్పుడే పిల్లల్లో సరైన పెరుగుదల ఉంటుంది. ఇక ఎదిగే పిల్లలకు ఎముకలకు తగినంత క్యాల్షియం అంది బలంగా ఉన్నప్పుడే, మంచి హైట్‌‌ పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. children;tara;iron;egg;vitamin;chicken;protiens;proteinబడుగు: పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇవి పెట్టండి..!బడుగు: పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇవి పెట్టండి..!children;tara;iron;egg;vitamin;chicken;protiens;proteinSun, 13 Dec 2020 17:00:00 GMTచికెన్, మటన్ వంటివి తీసుకుంటే కండరాల పెరుగుదలకు బాగా ఉపకరిస్తాయి. రోజుకో గుడ్డును తప్పక తీసుకునేలా చేయాలి. ఇక క్యాల్షియం కోసం పాలు తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి. పాలలో విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. రోజూ మూడు గ్లాసుల పాలను పిల్లలకు ఇవ్వడం చేయాలి. తద్వారా పిల్లలు ఎత్తుగా పెరుగుతారు.

ఇంకా సోయా ఉత్పత్తులను డైట్‌లో చేర్చుకోవడం ద్వారానూ పిల్లలు ఎత్తుగా పెరుగుతారు. సోయా మిల్క్ కూడా రోజుకో కప్పు లేదా గ్లాసు పిల్లలకు అందించడం చేయాలి. కేవలం మాంసాహారమే కాకుండా ఆకుకూరలు రోజుకో కప్పు మోతాదులో పిల్లలకు ఇవ్వాలి. మాంసాహారం తీసుకోని రోజు.. పిల్లల ఆహారంలో ఆకుకూరలు వుండాలి. వీటిల్లో వుండే విటమిన్స్ ఎముకలను బలపరచి, కండరాలను పెరిగేలా చేస్తాయి.

అయితే ముఖ్యంగా బచ్చలి కూరను పిల్లలకు శాండ్ విచ్ వంటి స్నాక్స్‌లో చేర్చి ఇవ్వడం చేస్తే ఇష్టపడి తింటారు. ఇందులోని ఐరన్, క్యాల్షియం, ఫైబర్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే కూరగాయలన్నింటినీ చేర్చి సూప్ ద్వారా పిల్లలకు అందించడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు. వీటిలో బెండకాయను అస్సలు మరిచిపోకూడదు. బెండలో ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డిలు వున్నాయి. ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు కూడా వీటిలో పుష్కలంగా వున్న కారణంగా వారానికి మూడు సార్లు పిల్లల డైట్‌లో బెండకాయను చేర్చాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. పిల్లలు హైట్‌‌ పెరగాలంటే చేయించాల్సిన మరో ఫిజికల్‌‌ యాక్టివిటీ ‘స్కిప్పింగ్‌‌’. దీనివల్ల బాడీ స్ట్రెచ్‌‌ అయ్యి, ఎత్తు పెరిగేందుకు హెల్ప్‌‌ అవుతుంది.


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>