SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news29eb040e-5e99-4224-8c85-2302eb5ca906-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news29eb040e-5e99-4224-8c85-2302eb5ca906-415x250-IndiaHerald.jpgటీమిండియా ఉత్తమ ప్రదర్శన కనబరచిన ప్రతిసారి హర్ధిక్ పాండ్య కీ రోల్ పోషిస్తున్నాడు.అంతటి కీలక ఆటగాడు అయిన హర్ధిక్ పాండ్యా ను ఆసీస్ తో ఆడబోయే టెస్ట్ సిరీస్ కీ ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ల మీద విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత్ టీ20 సిరీస్ విజయం సాధించడంలో పాండ్యా ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే అంతకముందు భారత్ కోల్పోయిన వన్డే సిరీస్ లో కూడా పాండ్యా తన బ్యాట్ తో చెలరేగిపోయాడు. sports news;agastya;virender sehwag;hardik pandya;india;australia;letter;icc t20;paruguస్పొర్ట్స్ : అతడే టీమిండియాకు కీలకం..:సెహ్వాగ్ !!స్పొర్ట్స్ : అతడే టీమిండియాకు కీలకం..:సెహ్వాగ్ !!sports news;agastya;virender sehwag;hardik pandya;india;australia;letter;icc t20;paruguSun, 13 Dec 2020 07:00:00 GMT టీమిండియా ఉత్తమ ప్రదర్శన కనబరచిన ప్రతిసారి హర్ధిక్ పాండ్య కీ రోల్ పోషిస్తున్నాడు.అంతటి కీలక ఆటగాడు అయిన హర్ధిక్ పాండ్యా ను ఆసీస్ తో ఆడబోయే టెస్ట్ సిరీస్ కీ ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ల మీద విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత్ టీ20 సిరీస్ విజయం సాధించడంలో పాండ్యా ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే అంతకముందు భారత్ కోల్పోయిన వన్డే సిరీస్ లో కూడా పాండ్యా తన బ్యాట్ తో చెలరేగిపోయాడు.

 మొత్తం మూడు వన్డేల్లో 210 పరుగులు చేసిన పాండ్యా మూడు టీ20 ల్లో 78 పరుగులు చేశాడు. మొత్తం ఈ ఆరు మ్యాచ్ లలో రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.ఆసిసి పర్యటనలో ఇంత ఉత్తమ గణాంకాలు ఉన్న పాండ్యా ను టెస్ట్ సిరీస్ కు ఎందుకు ఎంపిక చెయ్యలేదన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ సెలక్టర్ల మీద వ్యంగ్యస్త్రాలు సంధించాడు.భారత టెస్ట్ జట్టులో హార్దిక్ పాండ్యా చాలా కీలకం అని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఈ విషయం పై సెహ్వాగ్ స్పందిస్తూ... ఈ పర్యటనలో బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉంటే హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో కూడా ఉండేవాడు అని బి‌సి‌సి‌ఐ కీ చురకలు అంటించాడు.

అతను బౌలింగ్ చేయడానికి ఫిట్ కానంతవరకు తనను టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేయకండి అని హార్దిక్ పాండ్యా సెలెక్టర్లకు చెప్పి ఉండవచ్చు అని వీరేందర్ సెహ్వాగ్ అన్నారు.అయితే హర్ధిక్ మాత్రం హ్యాపీ గా ఇంటి దగ్గరతన కొడుకు తోసంతోషంగా గడుపుతున్నాడు దాదాపు నాలుగునెలల పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఆస్ట్రేలియా సిరీస్‌ అంటూ క్రికెట్‌లో తలమునకలై ఉన్న హార్దిక్‌ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు.  


పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>