HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpgకరోనా రెండో దశ అంచనాలపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఓ నిపుణుల కమిటీ నియమించింది.వీరిలో కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, సోషియల్‌ ప్రీవెంటివ్‌ మెడిసిన్, న్యూరో ఫిజిషియన్‌ ప్రభుత్వ నిపుణులు కాగా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనరీ మెడిసిన్‌ నిపుణులు ప్రైవేట్‌కు చెందినవారు. ఈ ఏడుగురు నిపుణుల కమిటీ కరోనా సెకండ్‌ వేవ్‌ అవకాశాలు, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇచ్చింది. మహమ్మారి క్రమంగా తగ్గినా.. మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.corona;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;madhya pradesh - bhopal;west bengal - kolkata;american samoa;january;capital;europe countries;march;coronavirus;panjaaఏపీలో మరలా కరోనా విజృంభణ అవకాశాలు- నిపుణుల కమిటీ హెచ్చరిక!ఏపీలో మరలా కరోనా విజృంభణ అవకాశాలు- నిపుణుల కమిటీ హెచ్చరిక!corona;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;madhya pradesh - bhopal;west bengal - kolkata;american samoa;january;capital;europe countries;march;coronavirus;panjaaSun, 13 Dec 2020 08:05:00 GMTకరోనా వైరస్, మన రాష్ట్రంలోనూ ఒక రేంజ్ లో తన విజ్రమ్భన కొనసాగించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. రోజుకి సగటున 500 నుంచి 600 మధ్య కేసులు నిర్ధారణ అవుతుండగా.. ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే, మహమ్మారి క్రమంగా తగ్గినా.. మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దశలో రోజుకు 10 వేల కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక అంచనా వేసింది. కానీ, ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండోసారి మహమ్మారి పంజా విసిరే సూచనలు ఉన్నాయని పేర్కొంది.





చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని, రెండో దశను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోగా.. కరోనా పీక్‌ (తీవ్రత ఎక్కువగా)లో ఉన్న దశ నుంచి ఐదు నెలల విరామం తర్వాత సెకండ్‌ వేవ్‌ వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే జరిగిందని నిపుణులు అంచనా వేశారు. ఏపీలో ఆగస్టు – సెప్టెంబర్‌ మధ్య తీవ్రత ఎక్కువగా ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గిందని తెలిపింది. తిరిగి ఐదు నెలల తర్వాత అంటే 2021 జనవరి 15 నుంచి మార్చి 15లోగా రెండో దశకు అవకాశాలున్నాయని నివేదిక హెచ్చరించింది. అయితే ఈ దశలో వైరస్‌ తీవ్రత ఎంతగా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని వివరించింది.
 




అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితులను నిపుణులు అంచనా వేశారు. వీటిని బట్టి చూస్తే ఏపీలో కచ్చితంగా వస్తుందని, రాదు అని గానీ చెప్పలేమని, వచ్చేందుకు అవకాశాలు మాత్రం ఉన్నాయని తెలియజేసింది. సెకండ్‌ వేవ్‌ పరిస్థితులకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండటం మంచిదని, సెకండ్‌ వేవ్‌లో చాలా దేశాలు, రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారని తెలిపారు. కరోనా రెండో దశ అంచనాలపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఓ నిపుణుల కమిటీ నియమించింది. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే నలుగురు, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వీరిలో కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, సోషియల్‌ ప్రీవెంటివ్‌ మెడిసిన్, న్యూరో ఫిజిషియన్‌ ప్రభుత్వ నిపుణులు కాగా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనరీ మెడిసిన్‌ నిపుణులు ప్రైవేట్‌కు చెందినవారు. ఈ ఏడుగురు నిపుణుల కమిటీ కరోనా సెకండ్‌ వేవ్‌ అవకాశాలు, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 60,029 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>