MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss849cf695-0ffe-4941-929a-2828293b9484-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss849cf695-0ffe-4941-929a-2828293b9484-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4లో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారిలో అభిజీత్ దుద్దాల కూడా ఒకరు. ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసిన అభిజీత్, ఆ సినిమా ద్వారా మంచి విజయాన్ని అలానే పేరుని దక్కించుకున్నాడు. ఇక ఇటీవల యాంకర్ వర్షిణి తో కలిసి అతడు చేసిన పెళ్లి గోల వెబ్ సిరీస్ అతడికి మరింత పేరు తెచ్చాయి. bigg boss 4 telugu;abhijeet;akhil akkineni;sekhar;kamma;geum;cinema;bigboss;marriage;winner;winner1;house;beautifulఅబ్బా, ఏమి గేమింగు ... ఏమి టైమింగు .. ఏమి ఓటింగు .. బిగ్ బాస్ విన్నర్ నువ్వే నహే ....??అబ్బా, ఏమి గేమింగు ... ఏమి టైమింగు .. ఏమి ఓటింగు .. బిగ్ బాస్ విన్నర్ నువ్వే నహే ....??bigg boss 4 telugu;abhijeet;akhil akkineni;sekhar;kamma;geum;cinema;bigboss;marriage;winner;winner1;house;beautifulSun, 13 Dec 2020 01:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న వారిలో అభిజీత్ దుద్దాల కూడా ఒకరు. ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసిన అభిజీత్, ఆ సినిమా ద్వారా మంచి విజయాన్ని అలానే పేరుని దక్కించుకున్నాడు. ఇక ఇటీవల యాంకర్ వర్షిణి తో కలిసి అతడు చేసిన పెళ్లి గోల వెబ్ సిరీస్ అతడికి మరింత పేరు తెచ్చాయి.
ఇక ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ షోలో అభిజీత్ తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ముందుకు కొనసాగుతున్నాడు అనే చెప్పాలి. ఇక మరోవైపు అతడు దాదాపుగా గడచిన మొత్తం 14 వారాల్లో ఏకంగా 11 వారాలు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా మంచి ఓటింగ్స్ తో ఎప్పటికప్పుడు సేఫ్ అవుతున్నాడు. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ తాజా 14వ వారం కూడా అతడు సేఫ్ కానున్నట్లు సమాచారం. ఇక మొదటి నుండి మైండ్ గేమ్ తో అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ కొనసాగుతున్న అభిజీత్ పై ఫీజికల్ టాస్క్ లు సరిగ్గా ఆడడు అనేటువంటి కొద్దిపాటి విమర్శ మాత్రం ఉంది. అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా అతడు బాగా వ్యవహరిస్తూ మంచి టైమింగ్ తో ముందుకు నడుస్తున్నాడు.  

బయట మరోవైపు అతడికి సపోర్ట్ గా పలు ఆర్మీలు కూడా వెలసి ఎప్పటికప్పుడు అతనికి భారీ స్థాయిలో ఓట్లు కూడా వేస్తూ మద్దతు ఇస్తూ వస్తున్నాయి. ఇక హౌస్ లో సోహెల్, అరియనా, హారిక, అఖిల్ వంటి వారు అతడికి మంచి పోటీ ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు అభిజీత్ కి వచ్చిన భారీ ఓటింగ్ షేర్ మాత్రం వారిలో ఎవరికీ రాలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అతడికి సోషల్ మీడియాలో కూడా భారీగా మద్దతు లభిస్తుండడంతో ఎక్కువ శాతం అతడు ఫైనల్ విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి వారందరూ భావిస్తున్నట్లు అభిజీత్ ఈ తాజా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలుస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాలి....!!   


ఐ మిస్ యూ సుధీర్.. 'ఢీ'షోలో ప్రేమ బయటపెట్టిన రష్మి..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>