PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mp-details4bb09a99-aa21-4968-8f63-351b97cf5571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mp-details4bb09a99-aa21-4968-8f63-351b97cf5571-415x250-IndiaHerald.jpgప్రతీ కార్యక్రమానికి ఈయనను పిలవడం మానేశారట. మరోవైపు టీఆర్‌ఎస్‌ను వీడి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ పెద్దపల్లి పరిధిలో మళ్లీ పట్టుసాధించేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ చీమ కుట్టినట్టైనా లేకుండా సైలెంట్ గా ఉన్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. trs mp details;venkatesh;telangana rashtra samithi trs;telangana;mp;service;party;peddapalliతెలంగాణ రాజకీయం: "ఎంపీ" అయితే కొమ్ములొస్తాయా ఏంటి...?తెలంగాణ రాజకీయం: "ఎంపీ" అయితే కొమ్ములొస్తాయా ఏంటి...?trs mp details;venkatesh;telangana rashtra samithi trs;telangana;mp;service;party;peddapalliSun, 13 Dec 2020 12:00:00 GMTసేవ కోసమే ఊపిరి తీసుకుంటున్నా అన్నట్లుగా అనిపించే వ్యక్తిత్వం. కానీ అది అప్పట్లో ఇప్పుడు ఆ ప్రజలకే కనుమరుగైపోయాడు. అప్పట్లో పిలిస్తే పలికే నాయకుడు ఈనాడు కనుచూపు మేరలో కూడా  లేడు అని ప్రజలు విమర్శించేలా మారాడట...దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు..??? ఏం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం..!

టిఆర్ఎస్ కు చెందిన నేత....పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్. ఒకప్పుడు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ నేత, రాజకీయాలపై విరక్తి కలిగాయో.. లేక రాజకీయాలు వంటబట్టలేదో కానీ.. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి, అధికార పార్టీలో చర్చకు తావిస్తోంది. అధికార పార్టీ వ్యక్తి అంటే.. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... వారిని ఎలా గద్దె దించుదామా అన్నట్టుగా ఉంటారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా ఈ టీఆర్ఎస్ ఎంపీ ఏమీ పట్టనట్టు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అటు ప్రజలకు ఇటు పార్టీ నేతలకు ఎవరికీ అందుబాటులో లేరు అంటూ రూమర్లు బాగానే వినిపిస్తున్నాయి.

 మరోవైపు మైక్ దొరికితే చాలు, అనర్గళంగా ప్రతి పాయింట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా వెంకటేష్ మాట్లాడతాడు కానీ.. ఈయనకు మాటల్లో ఉన్న వేగం చేతల్లో లేదు అంటూ  మరో వర్గం ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఈయన వల్ల ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని... ప్రతీ కార్యక్రమానికి ఈయనను పిలవడం మానేశారట. మరోవైపు  టీఆర్‌ఎస్‌ను వీడి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ పెద్దపల్లి పరిధిలో మళ్లీ పట్టుసాధించేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ చీమ కుట్టినట్టైనా లేకుండా సైలెంట్ గా ఉన్నారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ విని విని టీఆర్ఎస్ ప్రభుత్వం విసుగు చెందింది అని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంకోవైపు వెంకటేష్ సైలెంట్ గానే ప్రజల మనసు గెలుచుకునే పనుల్లో నిమగ్నమై ఉన్నారంటూ మాట్లాడుతున్నారు.


ప్రతి 1000 మగాళ్ళ కు ఎంతమంది మహిళలు ఉన్నారంటే..??

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>