PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsc60793bc-0309-44b7-bcb3-3566461d1a33-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsc60793bc-0309-44b7-bcb3-3566461d1a33-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని హైదరాబాదు లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వినడానికి సినిమా కథలా ఉన్న ఈ రియల్ స్టోరీ నేటి సమాజ పరిస్థితికి అద్దం పడుతుంది. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణలోని అధికార పార్టీ నేతల వెంట చోటా మోటా నేతలు తిరుగుతూ ఉంటారు. అలా తిరిగే చోటామోటా నేతలలో ఒకడు ఒక యువతిని లైంగికంగా లొంగదీసుకుని ఆమెను తన ఉంపుడుగత్తెలా ఉంచుకున్నాడు. అయితే ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇది సరి కాదని అనుకుందేమో సదరు యువకుడితో వెళ్ళిపోయింది. అయితే ఇది తన ప్రిస్టేజ్ ఇష్యూ గా తీసుకున్న ఆ నేత వారిద్దరిని ఆరు నెలల telangan;prema;srikanth;tiru;hyderabad;telangana rashtra samithi trs;cinema;huzur nagar;police;love;air;arrest;cemetery;lie;reddy;party;kothapalli samuel jawaharఆ విషయంలో టీఆర్ఎస్ నేత ఆగడాలకు హద్దుల్లేవా..?ఆ విషయంలో టీఆర్ఎస్ నేత ఆగడాలకు హద్దుల్లేవా..?telangan;prema;srikanth;tiru;hyderabad;telangana rashtra samithi trs;cinema;huzur nagar;police;love;air;arrest;cemetery;lie;reddy;party;kothapalli samuel jawaharSun, 13 Dec 2020 16:04:40 GMTతెలంగాణలోని హైదరాబాదు లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వినడానికి సినిమా కథలా ఉన్న ఈ రియల్ స్టోరీ నేటి సమాజ పరిస్థితికి అద్దం పడుతుంది. స్థూలంగా చెప్పాలంటే తెలంగాణలోని అధికార పార్టీ నేతల వెంట చోటా మోటా నేతలు తిరుగుతూ ఉంటారు. అలా తిరిగే చోటామోటా నేతలలో ఒకడు ఒక యువతిని లైంగికంగా లొంగదీసుకుని ఆమెను తన ఉంపుడుగత్తెలా ఉంచుకున్నాడు. అయితే ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇది సరి కాదని అనుకుందేమో సదరు యువకుడితో వెళ్ళిపోయింది. అయితే ఇది తన ప్రిస్టేజ్ ఇష్యూ గా తీసుకున్న ఆ నేత వారిద్దరిని ఆరు నెలల పాటు వెతికి మరీ వెనక్కి తీసుకు వచ్చాడు. తీసుకు వచ్చి హైదరాబాద్ శివారులోని జవహర్ నగర్ లోని ఒక ఇంట్లో బంధించాడు.

 రోజూ తాగి వచ్చి ఇద్దరిని చితక్కొట్టే వాడు. 5 రోజుల క్రితం అతని ఆగడాలు మితిమీరి సదరు యువకుడిని చంపేశాడు. ఇంకేముంది అతని తీసుకువెళ్లి స్మశానం లో పాతి పెట్టాడు.  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే హైదరాబాదులోని అల్వాల్ అంజయ్య నగర్ కు చెందిన కనకరాజు టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నాడు. ఆయన ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదే యువతితో శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు మరలా సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కువయి ఇక్కడ ఉంటే కనకరాజు అడ్డుగా ఉన్నాడని భావించి వేరే ప్రాంతానికి పారి పోయారు. 

అయితే ఆరు నెలల పాటు వారిద్దరిని గాలించి తీసుకువచ్చిన కనకరాజు. జవహర్ నగర్ లోని ఒక ఇంట్లో బంధించి ఉంచాడు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డి ని కొట్టి చంపేశాడు. ఎవరికీ తెలియకుండా శవాన్ని తీసుకు వెళ్లి అల్వాల్ స్మశానంలో పూడ్చి పెట్టాడు. అనంతరం స్నేహితులతో మందేస్తూ తాను ఒక యువకుడిని చంపానని ఓపెన్ అయ్యాడు. ఈ విషయం స్నేహితులు పోలీసులకు తెలియజేయడంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం శవం కోసం శ్మశానంలో కోసం తవ్వకాలు చేస్తున్నారు. కనకరాజుని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.




నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>