SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/kkr-bowler-varun-chakravathy-got-married5df046c4-df0c-4758-9502-7657dfaa8384-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/kkr-bowler-varun-chakravathy-got-married5df046c4-df0c-4758-9502-7657dfaa8384-415x250-IndiaHerald.jpgఐపీఎల్‌-13 లో కోల్‌కతా తరఫున ఆడిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. వరుణ్‌ అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో తన ప్రేయసిని వివాహమాడాడు.వరుణ్‌ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను అతని మిత్రుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. varunchakravarthy;chakravarthy;varun;varun sandesh;varun tej;delhi;hyderabad;cricket;australia;marriage;world cup;tamilnadu;icc t20;indianరహస్యంగా పెళ్లి చేసుకున్న క్రికెటర్... ఫోటోలు వైరల్రహస్యంగా పెళ్లి చేసుకున్న క్రికెటర్... ఫోటోలు వైరల్varunchakravarthy;chakravarthy;varun;varun sandesh;varun tej;delhi;hyderabad;cricket;australia;marriage;world cup;tamilnadu;icc t20;indianSat, 12 Dec 2020 19:04:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా జట్టు తరపున ఆడిన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. తనకు సన్నిహితులైన అతి కొద్ది మంది సమక్షంలో వరుణ్‌ చక్రవర్తి తన గర్ల్ ఫ్రెండ్ ను  వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని చెన్నైలో వీరి జంట ఏకమైంది.  వరుణ్‌ చక్రవర్తి మాత్రం తన పెళ్ళికి సంబంధించి ఎలాంటి విషయాన్ని బయట పెట్టలేదు. అయితే వరుణ్ చక్రవర్తి పెళ్లికి హాజరైన తన స్నేహితుడు అరుణ్ కార్తిక్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో వరుణ్ పెళ్లి ఫొటోను షేర్‌ చేయడంతో అభిమానులకు ఈ విషయం తెలిసింది.  వరుణ్‌ చక్రవర్తి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 కాగా కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ లో కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లెగ్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వైవిధ్యంతో బంతులు వేస్తూ మిస్టరీ స్పిన్నర్‌ గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తం 13 మ్యాచ్ లలో కేవలం 6.84 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫైవ్ వికెట్ హాల్ కూడా నమోదు చేసాడు.

ఐపీఎల్‌ ప్రదర్శనతో భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా వరుణ్‌ చక్రవర్తి  ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అయితే వరుణ్‌ చక్రవర్తి స్థానంలో జట్టులో చోటు సంపాదించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ సత్తాచాటిన విషయం తెలిసిందే. మంచి ప్రతిభ ఉన్న వరుణ్‌ చక్రవర్తి త్వరలోనే భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వచ్చే ఏడాది భారత్‌ లోనే టీ20 వరల్డ్ కప్ జరుగుతుండటంతో వరుణ్ చక్రవర్తి ఈ మెగా టోర్నీలో చోటు దక్కుతుందో చూడాలి మరి.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>