MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay6e29d564-c70e-4953-8abd-dd0e829d8dcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay6e29d564-c70e-4953-8abd-dd0e829d8dcb-415x250-IndiaHerald.jpgతమిళ నాట అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న స్టార్లలో విజయ్ పేరు తప్పకుండా ఉంటుంది. గతంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయే. ఆయన హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్.. యూట్యూబ్ లో రికార్డులు తిరగ రాస్తోంది. భారీ వ్యూస్ సంపాదించి యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టింది.vijay;view;dilip kumar;kamal hassan;kumaar;atlee kumar;dileep;dileep kumar;dilip;raja;rajani;sethu;vijay;vijay sethupathi;cinema;rajani kanth;kollywood;media;tamil;youtube;social media;you tube;husband;hero;joseph vijay;posters;master;chitramవిజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..vijay;view;dilip kumar;kamal hassan;kumaar;atlee kumar;dileep;dileep kumar;dilip;raja;rajani;sethu;vijay;vijay sethupathi;cinema;rajani kanth;kollywood;media;tamil;youtube;social media;you tube;husband;hero;joseph vijay;posters;master;chitramSat, 12 Dec 2020 21:10:00 GMTతమిళ నాట అగ్ర కథానాయకుడిగా  వెలుగొందుతున్న స్టార్లలో విజయ్ పేరు తప్పకుండా ఉంటుంది. గతంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయే. ఆయన హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్.. యూట్యూబ్ లో రికార్డులు తిరగ రాస్తోంది. భారీ వ్యూస్ సంపాదించి యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టింది.

 ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటిస్తుండటం కూడా చిత్రంపై ఆసక్తి రేపుతోంది. విజయ్ సేతుపతి, విజయ్ కలిసి ఉన్న పోస్టర్ ఇప్పటికే నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని? కోలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చాలా మంది డైరెక్టర్లతో విజయ్ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో  విజయ్‌ 65వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

విజయ్‌ తదుపరి సినిమాను మురుగదాస్‌, అట్లీ వంటి దర్శకులతో చేస్తాడని అందరూ అనుకుంటే వారికి విజయ్ షాక్ ఇచ్చాడు. 'కొలమావు కోకిల' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించబోతుందని సమాచారం. ఇక ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తాడట. అయితే లేటెస్ట్‌గా ఈ సినిమాకి 'టార్గెట్ రాజా' అనే టైటిల్ ఫిక్స్ చేశారని, టైటిల్ పోస్టర్ ఇదేనంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.

ఇది ఇప్పటికే తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా తమ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసే సన్‌ పిక్చర్స్‌.. విజయ్ 65 సినిమా టైటిల్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి అభిమానుల అంచనాను ఈ కొత్త కాంబినేషన్ అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.


ఫైజర్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>