MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gauthami71ce1d55-24c9-4e23-90e5-b2fffadd9765-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gauthami71ce1d55-24c9-4e23-90e5-b2fffadd9765-415x250-IndiaHerald.jpgఅలనాటి స్టార్ హీరోయిన్ గౌతమి తాడిమల్ల తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషా చిత్రాల్లో నటించి భారతీయ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన గౌతమి.. భానుప్రియ, రేవతి, అమల హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చారు. gauthami;business;amala akkineni;kamal hassan;rajinikanth;revathi;bhanu;gouthami;prema;sandeep;tara;cinema;tamil;businessman;marriage;kannada;love;hindi;interview;cancer;doctor;husband;girl;heroine;romantic;lieహీరోయిన్ గౌతమి మొదటి భర్త ఇంతటి ప్రముఖమైన వ్యక్తా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..హీరోయిన్ గౌతమి మొదటి భర్త ఇంతటి ప్రముఖమైన వ్యక్తా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..gauthami;business;amala akkineni;kamal hassan;rajinikanth;revathi;bhanu;gouthami;prema;sandeep;tara;cinema;tamil;businessman;marriage;kannada;love;hindi;interview;cancer;doctor;husband;girl;heroine;romantic;lieSat, 12 Dec 2020 12:00:00 GMTహీరోయిన్ గౌతమి తాడిమల్ల తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషా చిత్రాల్లో నటించి భారతీయ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన గౌతమి.. భానుప్రియ, రేవతి, అమల హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చారు. బుల్లితెర నటీమణి గా, వ్యాఖ్యాతగా కూడా ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు.

డాక్టర్ వసుంధరాదేవి, డాక్టర్ శేషగిరిరావు దంపతులకు శ్రీకాకుళం జిల్లాలో 1968లో జూలై 2న జన్మించిన గౌతమి 1998 లో సందీప్ భాటియా అనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఈ దంపతులకు సుబ్బలక్ష్మి అనే ఒక అమ్మాయి పుట్టింది. వెనువెంటనే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. నిజానికి సందీప్ ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ కాగా.. ఆయన పేరు ఇప్పటికీ బుల్లితెరపై కనిపిస్తూనే ఉంటుంది. చాలా పేరుప్రఖ్యాతలు కలిగిన ఈ ఫైనాన్షియల్ అనలిస్ట్ ని వదిలేసి గౌతమి కమల్ హాసన్ వెంట పడ్డారని సినీ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది.

గౌతమి, కమల్ హాసన్ ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వాళ్లు మాత్రం పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం ప్రారంభించారు. 2004 నుంచి 2015 వరకు గౌతమి కమల్ హాసన్ పెళ్లి చేసుకోకుండానే తమ రొమాంటిక్ బంధాన్ని కొనసాగించారు. అయితే తనని కమలహాసన్ శారీరకంగా, మానసికంగా వాడుకొని.. ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయలేదని.. గౌతమి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. దీంతో భారత దేశ వ్యాప్తంగా వీరిద్దరి ఎఫైర్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వీరి వివాదం సద్దుమణిగింది. అప్పట్లో గౌతమి క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే తన తల్లిదండ్రులు వైద్యరంగంలో కొనసాగుతున్న వారే కాబట్టి ఆమెకు వెంటనే మెరుగైన చికిత్స అందేలా జాగ్రత్త పడ్డారు. దీంతో ఆమె క్యాన్సర్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం గౌతమి తన కూతురుతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారని తెలుస్తోంది.


రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>