PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlcbarilikodandarampotichestara1c1dd625-2119-41ec-8c43-30c168474c1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlcbarilikodandarampotichestara1c1dd625-2119-41ec-8c43-30c168474c1b-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కేసీఆర్ తర్వాత ప్రముఖంగా విన్పించే పేరు కోదండరామ్ దే. తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా కొనసాగిన కోదండరాం ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. వంటావార్పు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమకారుల్లో జోష్ నింపారు.kodandaram;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;nalgonda;strike;tdp;jac;research and analysis wing;josh;janagama;partyకోదండరామ్ బరిలో ఉంటారాకోదండరామ్ బరిలో ఉంటారాkodandaram;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;congress;nalgonda;strike;tdp;jac;research and analysis wing;josh;janagama;partySat, 12 Dec 2020 08:06:21 GMT

కోదండరామ్ బరిలో ఉంటారా

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కేసీఆర్ తర్వాత ప్రముఖంగా విన్పించే పేరు కోదండరామ్ దే. తెలంగాణ జేఏసీ కన్వీనర్ గా కొనసాగిన కోదండరాం ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. వంటావార్పు వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమకారుల్లో జోష్ నింపారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి ఆయన కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండటంతో కేసీఆర్.. కోదండరాం మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కోదండరాంను కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు. కోదండరాంపై పలుమార్లు అనుచిత కామెంట్స్ చేయడంతో వారి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆ తర్వాత కోదండరాం సైతం కేసీఆర్ కు వ్యతిరేకంగా కిందటి ఎన్నికల్లో మహాకూటమికి మద్దతు ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో కోదండరాం జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్తలు విన్పించాయి. అయితే కాంగ్రెస్ పొన్నాల లక్ష్మయ్యకు సీటివ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో మహాకూటమి దారుణంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత కూడా కోదండరాం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూనే వచ్చారు.

అయితే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన పడుతుండగా బీజేపీ బలపడుతూ వస్తోంది. ఈక్రమంలోనే కోదండరాం కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నాడనే టాక్ విన్పిస్తోంది. కాంగ్రెస్ సైతం కోదండరాం ను పెద్దగా పట్టించుకోకపోవడంతో వీరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కోదండరామ్ త్వరలో జరిగబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కోదండరాం పట్టభద్రుల స్థానంలో పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ విన్పిస్తోంది. కిందటి ఎన్నికల్లో కోదండరాం మహాకూటమికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోదండరాంకు మద్దతు ఇస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదాండరాం బరిలో దిగితే టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయిన సొంత ఇమేజ్ తో బరిలో దిగేందుకు కోదండరాం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్న కోదంరాం కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>