PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpd02d85b3-929e-44ca-8d4a-aea489b3c09f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdpd02d85b3-929e-44ca-8d4a-aea489b3c09f-415x250-IndiaHerald.jpgతెలుగు దేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. మహానుభావుడు ఎన్టీయార్ ఏ ముహూర్తాన పార్టీని పెట్టాడో కానీ అది చెక్కుచెదరని ముహూర్తమే అయింది. ఎన్నో ఒడుదుడుకులు, ఇబ్బందులు ఈ నాలుగు దశాబ్దలా కాలంలో చవి చూసినా టీడీపీ ఇప్పటికీ సీన్ లో ఉంది అంటే ఆ బలమైన ముహూర్తమే కారణం అంటారు జాతకాలను నమ్మేవాళ్ళు. tdp;ntr;tiru;bharatiya janata party;telugu desam party;jagan;janasena;congress;2019;telugu;tirupati;history;assembly;cycle;tiger;husband;tdp;ycp;janasena party;partyటీడీపీ ప్లేస్ ఏంటో చెప్పే ఎన్నికకు కౌంట్ డౌన్ ?టీడీపీ ప్లేస్ ఏంటో చెప్పే ఎన్నికకు కౌంట్ డౌన్ ?tdp;ntr;tiru;bharatiya janata party;telugu desam party;jagan;janasena;congress;2019;telugu;tirupati;history;assembly;cycle;tiger;husband;tdp;ycp;janasena party;partySat, 12 Dec 2020 10:30:00 GMTఎన్టీయార్ ఏ ముహూర్తాన పార్టీని పెట్టాడో కానీ అది చెక్కుచెదరని ముహూర్తమే అయింది. ఎన్నో ఒడుదుడుకులు, ఇబ్బందులు ఈ నాలుగు దశాబ్దలా కాలంలో చవి చూసినా టీడీపీ ఇప్పటికీ సీన్ లో ఉంది అంటే ఆ బలమైన ముహూర్తమే కారణం అంటారు జాతకాలను నమ్మేవాళ్ళు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక 2019 నాటి ఘోరమైన అవమానం చవి చూసి ఎరగదు, కేవలం 23 సీట్లు మాత్ర‌మే ఆ పార్టీకి దక్కాయి అంటే అంతటి తీవ్ర వ్యతిరేకత జనంలో ఉందని భావించాలి. ఇక ఈ ఏడాదిన్నరలో గత పది నెలల కాలం కరోనా పుణ్యమాని జనంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు కనీసంగా కూడా వెళ్ళలేకపోయారు. క్యాడర్ సైతం ఎక్కడివారు అక్కడే అన్నట్లుగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో పులి మీద పుట్ర అన్నట్లుగా తిరుపతి ఉప ఎన్నిక వచ్చిపడింది. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలమే అయింది. ఎన్నికల హామీలను ఆయన 90 శాతం పైగా నెరవేర్చారు. దాంతో పాటు తిరుపతిలో వైసీపీకి మొదటి నుంచి బలం ఉంది. ఇక తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సీట్లలో  కూడా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. జగన్ కూడా ప్రత్యేక దృష్టిని పెట్టారు.

మరో వైపు ఇక్కడ వైసీపీ ఇప్పటికి రెండు సార్లు గెలిస్తే కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. బీజేపీ టీడీపీ చేరో సారి మాత్రమే గెలిచాయి. టీడీపీ గెలిచి కూడా మూడున్నర దశాబ్దాలు దాటింది. మరో వైపు చూస్తే బీజేపీ జనసేన ప్రత్యేక కూటమిగా రాబోతున్నాయి. వాటి ప్రభావం ఎంతో తెలియదు.  అటు టీడీపీ, ఇటు బీజేపీ ఉంటే కనుక రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీలుస్తాయి. అపుడు నల్లేరు మీద బండి నడకన వైసీపీ విజయం అవుతుంది.

ఇంతలా లెక్కలు ఉంటే టీడీపీ మాత్రం గెలవాలి అనుకుంటోంది. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం అని ఏకంగా చంద్రబాబే క్యాడర్ కి చెబుతున్నారు. ఒక వేళ గెలవకపోయినా గతం కంటే ఓట్లు తక్కువ వచ్చినా. బీజేపీ జనసేన కూటమి రెండవ స్థానంలోకి వచ్చినా కూడా సైకిల్ కి పంక్చర్ పడినట్లే. మొత్తానికి తిరుపతి ఇపుడు టీడీపీలో కొత్త సెగలు పుట్టిస్తోంది.




బరువు తగ్గితే, డయాబెటిస్ తగ్గుతుందా...?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>