MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sonu-sudh-about-farmers417da43c-c748-4c41-a5ce-3b7a6fd5c931-415x250-IndiaHerald.jpgపెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా రాసిన ఈ ఆత్మకథలో సోనూ బాయ్ తన అనుభవాలను పొందుపరిచారు. ‘ఐ యామ్ నో మెస్సయ్య’ అని పేరు పెట్టడం విశేషంగా నిలిచింది. దీనిపై సోనూ స్పందిస్తూ.. ‘ప్రజలు చాలా జాలి, దయ కలవారు. వారి అభిమానంతో నాకు మెస్సయ్య’ అని పేరు పెట్టారు. కానీ ‘నేను దేవుణ్ని కాదు. నా మనసుకు తోచింది మాత్రమే చేస్తాను’ అని అన్నారు. తను అనుభవించిన పరిస్థితులు ఎలా జీవితాన్ని మార్చాయనేది ఈ పుస్తకంలో ఆసక్తికరంగా ఉంటుందన్నారుsonusud;ankhita;deva;jeevitha rajaseskhar;naga chaitanya;nageshwara rao akkineni;tara;tiru;india;ram madhav;chittoor;smart phone;bus;k e krishnamurthy;chittor;village;2020;house;father;march;kshanam;research and analysis wing;lie;akkineni nageswara rao;chaitanya 1;coronavirusఆసక్తి రేపుతున్న సోనూ 'ఐయామ్ నో మెస్సయ్య'ఆసక్తి రేపుతున్న సోనూ 'ఐయామ్ నో మెస్సయ్య'sonusud;ankhita;deva;jeevitha rajaseskhar;naga chaitanya;nageshwara rao akkineni;tara;tiru;india;ram madhav;chittoor;smart phone;bus;k e krishnamurthy;chittor;village;2020;house;father;march;kshanam;research and analysis wing;lie;akkineni nageswara rao;chaitanya 1;coronavirusSat, 12 Dec 2020 16:40:00 GMTకరోనా వైరస్ లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను అక్కున చేర్చుకుని వారిపాలిట అపద్బాంధవుడయ్యారు సోనూసూద్. వివిధ రాష్ట్రాలకు బస్సులు, విమానాలను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించారు. చాలా మంది విద్యార్థులకు, పేదలకు చేయూతనిచ్చి నిజ జీవితంలో హీరోగా మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వలసదారులు సోనూను ‘మెస్సయ్య’ అని ప్రశంసిస్తున్నారు. మెస్సయ్య అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు వచ్చిన ఓ గొప్ప వ్యక్తి అని అర్థం. అందుకే సోనూసూద్‌ ఆటోబయోగ్రఫీకి ఆ పేరును ఖరారు చేశారు.


పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా రాసిన ఈ ఆత్మకథలో సోనూ బాయ్ తన అనుభవాలను పొందుపరిచారు. ‘ఐ యామ్ నో మెస్సయ్య’ అని పేరు పెట్టడం విశేషంగా నిలిచింది. దీనిపై సోనూ స్పందిస్తూ.. ‘ప్రజలు చాలా జాలి, దయ కలవారు. వారి అభిమానంతో నాకు మెస్సయ్య’ అని పేరు పెట్టారు. కానీ ‘నేను దేవుణ్ని కాదు. నా మనసుకు తోచింది మాత్రమే చేస్తాను’ అని అన్నారు. తను అనుభవించిన పరిస్థితులు ఎలా జీవితాన్ని మార్చాయనేది ఈ పుస్తకంలో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఈ పుస్తకం ఇటీవలే విడుదలయ్యింది. ఈ పుస్తకంలో చిత్తూరు రైతు నాగేశ్వరరావు గురించి సోనూ ప్రస్తావించారు. తన కుమార్తెలను కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేస్తున్న వీడియో చూసి తాను చలించిపోయానని అన్నారు. ‘గంటలు కాకుండా ఎకరాల్లో పనిచేసే వారికి అంకితం.. ఇవి నా స్వంత కవిత్వం కాదు.. నేను వాటిని ఒకసారి చదివినట్లు గుర్తు. అరువు తెచ్చుకున్నవే అయినా నా జ్ఞాపకాల తిప్పిచూస్తే 2020 జులై 25 శనివారం నాకు కనిపించిన దృశ్యం గురించి ఆలోచించినప్పుడు ఇది సరైంది.


‘కృష్ణమూర్తి అనే ఓ జర్నలిస్ట్ తనలో చైతన్యం తీసుకొచ్చినందుకు ఆయనకు రుణపడి ఉన్నాను.. వీడియోను అప్‌లోడ్ చేసి చిత్తూరు జిల్లాలోని మదనాపల్లెలో ఒక టమోటా రైతు నాగేశ్వరరావు గురించి ట్వీట్ చేశారు. రైతు సాంప్రదాయ ఎద్దులకు బదులుగా తన పొలాన్ని దున్నడానికి కుమార్తెలను ఉపయోగిస్తున్నారు.. ఇది చాలా బాధ కలిగించింది.. ఆ అమ్మాయిలు బడిలో ఉండాలి కానీ నాగలిని లాగకూడదు.. ఇది మహమ్మారి తీవ్రతకు నిదర్శనం... అయినప్పటికీ, నన్ను దిగజార్చడానికి నేను ఇష్టపడలేదు. ఆ దృశ్యం నా మైండ్‌లో రికార్డయ్యింది.. పేదరికంతో బాధపడుతున్న ఆ తండ్రి తన కుమార్తెలతో పొలం దున్నుతుంటే.. తల్లి ఎరువులు జల్లుతోంది.. నేను బాధపడుతున్నప్పుడు నాలో అంతర్గత చర్చ మొదలవుతుంది.. ఒకవైపు ఆడపిల్లలు మన గౌరవానికి ప్రతీకగా చెప్పుకుంటాం.. మరోవైపు ఈ పిల్లలు ఎద్దుల మాదిరిగా పొలంలో దున్నుతున్నారని అంతరాత్మ ఘోషించింది... అనేక మైళ్ల దూరం నుంచి నా తాదాత్మ్యం ఆ ఇద్దరు యువతుల విధిని మారుస్తుందని నేను ఊహించలేదు’ అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది.. రైతు కుటుంబం గురించి మరింత తెలుసుకోవడానికి అక్కడ తెలిసిన వ్యక్తులను సంప్రదించాను.. కొన్ని గంటల్లో వారు వివరాలు పంపారు.. అతని పేరు నాగేశ్వర రావు అని నేను తెలుసుకున్నాను.. సోషల్ మీడియాలో నా కంటపడ్డ ఆ దృశ్యం చిత్తూరుకు దగ్గరగా ఉన్న ఒక గ్రామంలోనిది.. నేను ఆ రాష్ట్రంలో పలుచోట్ల షూటింగ్‌ల్లో పాల్గొన్నా చిత్తూరు జిల్లాకు వెళ్ళలేదు. ఇప్పుడు, తాను తప్పక సందర్శించాల్సిన స్థలాల జాబితాలో నిలిచింది. జులై 25 రాత్రి 9.30 గంటలకు ఆంధ్రాకు చెందిన నా స్నేహితులు మరిన్ని వివరాలను అందించారు. అతని ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు.. నేను నాగేశ్వరరావుతో వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడాను.. మదనాపల్లెలో టీ స్టాల్ నడుపుతున్నానని చెప్పాడు.. కానీ మహమ్మారి తన చిరు వ్యాపారాన్ని దెబ్బకొట్టిందని ఆవేదన చెందాడు.. అతని కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అప్పటికే తెలుసుకున్నాను. ఈ క్షణంలో నేను వెంటనే రెండు ఎద్దులను ఏర్పాటు చేస్తానని నాగేశ్వరరావుకు వాగ్దానం చేశాను.. నా ఆఫర్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నాడు.. తిరుపతిలో ఎద్దులు అందుబాటులో ఉన్నాయని చెప్పి తిరిగి కొద్దిసేపటికి ఫోన్ చేశాడు.. పెద్దగా ఆలోచించకుండా ఎద్దులు కొనడానికి డబ్బు పంపుతానని నాగేశ్వరకు హామీ ఇచ్చాను. అయితే, ఆ కుటుంబ సమస్యలకు పరిష్కారం ఎద్దులు కాదు.. ట్రాక్టర్ అని తర్వాత గ్రహించాను. ఎద్దులతో పాటు శ్రమించడానికి ఎక్కువ మంది అవసరమవుతారు.. ఒక ట్రాక్టర్ వారి జీవితాలను గణనీయంగా మారుస్తుంది.. కాబట్టి, నేను నా మనసు మార్చుకున్నాను.. ఎద్దుల కోసం డబ్బు పంపించే బదులు, మర్నాడు అతనికి ఒక ట్రాక్టర్ అందజేస్తానని తెలియజేశాను. కానీ దీనికి ప్రతిగా తన కుమార్తెలు చదవించాలని వాగ్దానం తీసుకున్నాను. హృదయపూర్వకంగా పంజాబీలా మాట్లాడిన తరువాత నాకు ఎంతో సంతోషం కలిగింది.. మర్నాడు నాగేశ్వరరావుకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. పంజాబీలు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతారని ఇక్కడ నేను మీకు చెప్పాలి.. మేము ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో వ్యవసాయ సమాజంతో అనుబంధం పెంచుకుంటారు.. ఇంకొక విషయం ఏమిటంటే.. పంజాబ్‌లోని ప్రతి యువకుడు ట్రాక్టర్ నడుపుతాడు.


బీజేపీపై ప‌వ‌న్‌కు ఉన్న చివ‌రి ఆశా పాయే... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉందా...?

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>