MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raavi-kondala-rao6b0b025a-7859-4dca-9700-0d8b087f83b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raavi-kondala-rao6b0b025a-7859-4dca-9700-0d8b087f83b7-415x250-IndiaHerald.jpgఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కమర్షియల్ గానే ఉంటున్నాయి, అడల్ట్ కంటెంట్ తో కూడిన సినిమాలు కూడా ఎక్కువయిపోయాయి. కేవలం డబ్బుల కోసం తప్పితే సినిమాల్లో జీవం ఉండడం లేదు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో సినిమా అనేది కళ లేక వ్యాపారమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. raavi kondala rao;satyajith;audi;industries;cinema;producer;producer1;mahaసినిమా అనే వ్యాపారంలో కళామ్మతల్లి చచ్చిపోతుంది : రావికొండల రావుసినిమా అనే వ్యాపారంలో కళామ్మతల్లి చచ్చిపోతుంది : రావికొండల రావుraavi kondala rao;satyajith;audi;industries;cinema;producer;producer1;mahaSat, 12 Dec 2020 19:00:00 GMTసినిమా అనేది కళ లేక వ్యాపారమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్న ఇప్పుడు కాదు, కొన్నేళ్ళ క్రితమే ఓ పెద్దాయన అడిగేశారు. అతనే రావి కొండరాలరావు గారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దాదాపు 600 చిత్రాల్లో నటించి మెప్పించినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన్ని మనం కోల్పోయాం. అయితేనేం ఆయన జీవించి ఉన్న సినిమాలను చూసి తరించే అదృష్టం ఎలాగూ ఉంది. అయితే ఆయన ఒక దినపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్నప్పుడు సినిమా కాలమ్స్ రాసేవారు. ఆ సమయంలో మహా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని ఇంటర్వ్యూ చేశారట. అప్పుడు ఆయనని, రావి కొండలరావు గారు ఒక ప్రశ్న అడిగారట. సినిమాలో ఇన్ని కళలు ఉన్నాయి. సర్వకళ సమాహారమే సినిమా. కానీ దీన్ని పరిశ్రమ అంటున్నారు. పరిశ్రమ అంటే  వ్యాపారం. మరి సినిమా కళా? లేక వ్యాపారమా? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? అని ప్రశ్న వేశారట. దానికి ఆదుర్తి సుబ్బారావు గారు ఎంత గొప్పగా సమాధానమిచ్చారో మహానుభావులు. ఒక నిమిషం ఆలోచించి, "తేనెటీగలు తేనెను సేకరించి, పట్టులో నింపడం కళ. దాన్ని తీసి అమ్మడం వ్యాపారం" అని అన్నారు. అప్పుడు రావి కొండలరావు గారు, "నిజమే. కళ అంటే తేనె సేకరించడం లాంటిది. వ్యాపారం అంటే ఆ తేనెను అమ్ముకోవడం లాంటిది.

కానీ సినిమాలో  కళలున్నా, వ్యాపార లక్ష్యం ఎక్కువగా ఉంది కదా? సినిమా బాగా ఆడి, డబ్బు సంపాదించాలనే కదా ప్రతి నిర్మాత అనుకుంటాడు" అని మళ్ళీ ప్రశ్న వేశారు. అప్పుడు సుబ్బారావు గారు, "అందరూ చూడగలిగే ఉత్తమ సినిమా తీయాలి. అప్పుడు అందరూ చూస్తారు కనుక డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఆ నిర్మాత ఇంకో సినిమా తీసే అవకాశం వస్తుంది. ఏ కళయినా, దాన్ని నమ్ముకున్న వారికి ఇంత అన్నం పెట్టాలి. కేవలం కళే అనుకోవడం కాదు, ఆ కళని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళని రక్షించాలి" అని అన్నారు. "అవును, డబ్బు ఆశించకుండా ఎవరూ వ్యాపారం చేయరు. సినిమా వ్యాపారం చేస్తోంది గనుక దీన్ని పరిశ్రమ  అన్నారు. సత్యజిత్ రాయ్ లాంటి గొప్ప భారతీయ దర్శకుడే తాను తీసే సినిమాకి డబ్బు అక్కర్లేదనుకోరు. పది మంది సినిమా చూడాలి. చూస్తారు గనుక పెట్టిన పెట్టుబడి ఆ సినిమాయే సంపాదించుకుంటుంది. దర్శకుడు, నటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలనే కోరుకుంటారు. అలా వస్తే ఆ నిర్మాత మళ్ళీ ఆ డబ్బు సినిమాల్లోనే పెడతాడు. వ్యాపారం చేసేవాడు వస్తువుల్ని ఎలా అయితే కల్తీ చేయకూడదో, అలాగే సినిమాలు తీసేవారు కూడా కల్తీ చేయకూడదు" అని అన్నారు. నిజమే కదా, సినిమా అనేది ఒక అందమైన కళ. ఎప్పటికీ జీవం ఉండే వస్తువు. ఎక్స్ పైరీ డేట్ లేని అలాంటి వస్తువును కల్తీగా తయారుచేస్తే దాని పర్యావసానాలు చాలా నష్టం తెస్తాయి. అదే కల్తీ లేకుండా తీయగలిగితే దాని ప్రభావం కొన్ని తరాలకి ఆదర్శంగా నిలుస్తాయి.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>