PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/as-telangana-new-pcc-chief94a8efc0-b26a-4485-9991-c043c9d2743d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/as-telangana-new-pcc-chief94a8efc0-b26a-4485-9991-c043c9d2743d-415x250-IndiaHerald.jpgతెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరన్న దానిపై అభిప్రాయ సేకరణ ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన అభిప్రాయ సేకరణలో 160 మంది అభిప్రాయాలు సేకరించారు. గాంధీ భవన్ లో సమావేశాలు ముగించుకొని... ఢిల్లీకి వెళ్లారు ఠాగూర్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ..జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు ఠాగూర్. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా ఆఖరి రోజు అభిప్రాయ సేకరణకు పిలిచారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఢిల్లీకి వెళ్లిన ఠాగూర్... రెండు మూడు రోజుల్లో సోనియా గాంధీకి నివేదిక ఇస్తారు. నివేదికపై సోనియా గాంధీ అధas telangana new pcc chief;soniagandhi;sridhar;venkat;podem veeraiah;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;district;assembly;jagga reddy;reddy;party;mantraతెలంగాణ పీసీసీ చీఫ్ గా..!తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!as telangana new pcc chief;soniagandhi;sridhar;venkat;podem veeraiah;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;congress;district;assembly;jagga reddy;reddy;party;mantraSat, 12 Dec 2020 20:45:00 GMTతెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై అభిప్రాయసేకరణ ముగిసింది. ఇక అంతా అధిష్టానం చేతుల్లోనే ఉంది. చివరిరోజు అభిప్రాయ సేకరణ సందర్భంగా హడావుడి జరిగింది. కొందరు సీనియర్లు అభ్యంతరాలు లేవనెత్తి.. ఇలాగే చేస్తే పార్టీలో ఉండలేమని చెప్పినట్లు సమాచారం.

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరన్న దానిపై అభిప్రాయ సేకరణ ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన అభిప్రాయ సేకరణలో 160 మంది అభిప్రాయాలు సేకరించారు. గాంధీ భవన్ లో సమావేశాలు ముగించుకొని... ఢిల్లీకి వెళ్లారు ఠాగూర్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ..జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు ఠాగూర్. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను కూడా ఆఖరి రోజు అభిప్రాయ సేకరణకు పిలిచారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఢిల్లీకి వెళ్లిన  ఠాగూర్...  రెండు మూడు రోజుల్లో సోనియా గాంధీకి నివేదిక ఇస్తారు. నివేదికపై సోనియా గాంధీ అధ్యయనఁ చేసి... ముగ్గురు ఆశావహులను ఢిల్లీకి పిలుస్తారు. ముగ్గురిలో ఒక్కరిని టీ-పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేస్తారు.

ఒకవైపు ఠాగూర్.. గాంధీ భవన్ లో అభిప్రాయ సేకరణ చేస్తుంటే..పార్టీ సీనియర్ నాయకులు సీఎల్పీ లో సమావేశం అయ్యారు. సీఎల్పీ లో భట్టి ..జగ్గారెడ్డి..పొడెం వీరయ్య, శ్రీధర్ బాబు..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సమావేశం అయ్యారు. పార్టీ పీసీసీ ఎంపికపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
సీఎల్పీ లో సమావేశం తర్వాత  ఠాగూర్ తో నేరుగా భేటీ అయ్యారు నేతలు. సోనియాగాంధీకి ఇక్కడి పరిస్థితులు తెలియాలి..? అని ఎమ్మెల్యేలు  ఠాగూర్ కి స్పష్టంచేశారు. పార్టీ సీనియర్ల కు..పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రమే పీసీసీ ఇవ్వాలని కోరారు. లేదంటే తాము పార్టీలో ఉండలేమని చెప్పినట్టు సమాచారం. అయితే ఠాగూర్ అందరి అభిప్రాయాలు సోనియాగాంధీ కి నివేదిస్తా.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా... దానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.

మొత్తనికి కాంగ్రెస్ చీఫ్ ఎంపికపై హైదరాబాద్‌లో కసరత్తు ముగిసింది. ఇక ఆశావాహులు,  లాబీయింగ్ నమ్ముకున్న వాళ్లంతా  ఢిల్లీకి పయనం అవుతున్నారు. 


ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>