PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersf2374aea-a2df-487d-a339-cce02205d553-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmersf2374aea-a2df-487d-a339-cce02205d553-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనను కౌంటర్ చేయాలని అధికార బీజేపీ ప్రభుత్వం భావిస్తోందట. రైతుల ఆందోళనకు దీటుగా బీజేపీ కౌంటర్ వ్యూహానికి శ్రీకారం చుట్టిందని సమాచారం. రైతులతో కేంద్రం ఇటీవలే జరిపిన విఫలం అయ్యాయి.farmers;view;hari;hari music;delhi;bharatiya janata party;piyush goyal;2020;job;minister;central government;punjab;piyush chawla;party;mantra;narendraరైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..farmers;view;hari;hari music;delhi;bharatiya janata party;piyush goyal;2020;job;minister;central government;punjab;piyush chawla;party;mantra;narendraSat, 12 Dec 2020 20:28:40 GMTకేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనను కౌంటర్ చేయాలని అధికార బీజేపీ ప్రభుత్వం భావిస్తోందట. రైతుల ఆందోళనకు దీటుగా బీజేపీ కౌంటర్ వ్యూహానికి శ్రీకారం చుట్టిందని సమాచారం. రైతులతో కేంద్రం ఇటీవలే జరిపిన  విఫలం అయ్యాయి. దీంతో నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రులతో సహా బీజేపీ అగ్రనేతలను సామాన్య ప్రజానీకంలోకి పంపించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ‘‘ప్రయోజనాలను’’ వివరించాలని బీజేపీ డిసైడయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తదితరులు దీనికోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. వీరంతా వీధుల్లోకి వెళ్లి ఈ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.


కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో రైతులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020, నిత్యావసర సరకుల (సవరణ) చట్టం- 2020 సహా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర, మండీల వ్యవస్థను కొనసాగించాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలకు అవసరమైతే సవరణలకు చేసేందుకు సిద్ధమని, వాటిని రద్దు చేయడం మాత్రం జరగదని కేంద్రం చెబుతోంది. అయితే సవరణలకు ససేమిరా అంటున్న రైతు నేతలు.. ఈ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టు పడుతున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి కేంద్రం తాజా వ్యూహంపై రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>