PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-meet-civil-aviation-minister13ee110f-7c3f-43b9-b9c4-935c1a7f9ba9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-meet-civil-aviation-minister13ee110f-7c3f-43b9-b9c4-935c1a7f9ba9-415x250-IndiaHerald.jpgకేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్‌ పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్తగా 6 ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రికి లేఖను అందించారు. నాన్ - షెడ్యూల్డ్ ఆప‌రేట‌ర్స్ ప‌ర్మిట్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు సొంత నిధుల‌తో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.kcr;modi;amit shah;kcr;delhi;india;telangana;narendra modi;amith shah;district;prime minister;chief minister;minister;letter;central government;v;mantra;narendraతెలంగాణలో 6 ఎయిర్ పోర్టులకు అనుమతివ్వండితెలంగాణలో 6 ఎయిర్ పోర్టులకు అనుమతివ్వండిkcr;modi;amit shah;kcr;delhi;india;telangana;narendra modi;amith shah;district;prime minister;chief minister;minister;letter;central government;v;mantra;narendraSat, 12 Dec 2020 21:34:25 GMTఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ సహా హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలిసారు. ఇక శనివారం కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి  హ‌ర్దీప్ సింగ్‌ పురితో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో కొత్త‌ ఎయిర్‌పోర్టుల అంశంపై కేంద్ర మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం దీనికి సంబంధించి కేంద్ర మంత్రికి లేఖ కూడా అందించారు. కాగా తెలంగాణలో కొత్తగా 6 డొమెస్టిక్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే ఈ ఎయిర్ పోర్టులకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.

పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని బ‌సంత్‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలోని మామునూర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాలోని జ‌క్రాన్‌ప‌ల్లి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని దేవ‌ర‌క‌ద్ర‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో  విమానాశ్ర‌యాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. కాగా రాష్ట్రంలో కొత్త ఎయిర్‌ పోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు  కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. విమానాశ్ర‌యాల ఏర్పాటుకు సంబంధించి 2018లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక కూడా పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. చిన్న విమానాల కోసం ఫ్రిల్స్ విమానాశ్ర‌యాలు మాత్ర‌మే అభివృద్ధి చేయ‌బ‌డుతాయ‌ని నివేదిక సూచించింద‌న్న విష‌యాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మొత్తం 6 చోట్ల దేశీయ విమానాశ్ర‌యాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు పంపిందని,ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వ‌హించిన అబ్ స్టాకిల్ లిమిటేష‌న్ స‌ర్ఫేస్ స‌ర్వే, సాయిల్ టెస్ట్, ఇత‌ర ప‌రిశీల‌న డ్రాఫ్ట్ రిపోర్టు తాజాగా వ‌చ్చింద‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. నూత‌న ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ‌ను సీఎం కేసీఆర్ కోరారు. ఎయిర్‌పోర్టు సైట్‌ల‌ను ఖ‌రారు చేయ‌డంలో సింగిల్ విండో ప్ర‌తిపాదిక‌న అన్ని చ‌ట్ట‌బ‌ద్ద‌మైన అనుమ‌తులు ఇవ్వాల‌ని అన్నారు. నాన్ - షెడ్యూల్డ్ ఆప‌రేట‌ర్స్ ప‌ర్మిట్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేందుకు సొంత నిధుల‌తో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.


విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>