BirthdaySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/birthday/125/ex-indian-soldier-entered-in-hundredth-year1f94a2b0-262b-48ba-976c-60f30f55cc0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/birthday/125/ex-indian-soldier-entered-in-hundredth-year1f94a2b0-262b-48ba-976c-60f30f55cc0b-415x250-IndiaHerald.jpg1939-45 కాలంలో జరిగిన రెండో ప్రపంచం యుద్ధం సహా 1965 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ కల్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్ శుక్రవారం వందో వసంతంలోకి అడుగుపెట్టారు. నాటి యుద్ధంలో పాల్గొని, త్రివిధ దళాల్లోనూ సేవలందించిన ఒకే ఒక్క అధికారి ప్రీతిపాల్ కావడం విశేషంsoldier;ajay;india;pakistan;doctor;war;army;service;yuva;father;indian;hockeyసెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!soldier;ajay;india;pakistan;doctor;war;army;service;yuva;father;indian;hockeySat, 12 Dec 2020 17:00:00 GMTఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరిన ప్రీతిపాల్ సింగ్‌కు కరాచీలో తొలి పోస్టింగ్ దక్కింది. అప్పటికే ప్రత్యేక దేశం ఉద్యమం ఊపందుకోవడంతో ఆందోళన చెందిన గిల్ కుటుంబం.. తమకు పరిచయస్థుడైన నాటి బ్రిటిష్ ఆర్మీ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఏ సవాయ్‌ను కలిసింది. ఆయన సిఫార్సుతో గిల్‌ను నేవీకి బదిలీ చేశారు.


 రెండో ప్రపంచ యుద్ధంలో గెజిటెడ్ అధికారిగా ఐఎన్ఎస్ టీర్‌లో చేరడానికి ముందు మైన్ స్వీపింగ్ ఓడలో విధులు నిర్వర్తించినట్టు తెలిపారు. నేవీలో యువ సబ్-లెఫ్టినెంట్‌గా చేరిన తర్వాత లాంగ్ రేంజ్ గన్నరీ కోర్సును పూర్తిచేసి గన్నరీ ఇన్‌స్ట్రక్టర్ హోదా పొందాను.. అలాగే సిక్కు రెజిమెంట్‌కు సేవ చేసే కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఆశతో నేను ఆర్మీలో చేరాను’ అన్నారు. గన్నరీ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన అనుభవం వల్ల గ్వాలియర్ మౌంటెయిన్ బ్యాటరీలో పోస్టింగ్ దక్కిందని గిల్ కుమారుడు డాక్టర్ అజయ్ పాల్ సింగ్ తెలిపారు. ప్రీతిపాల్ కుటుంబంలోని మూడు తరాలు ముత్తాత నేహన్ సింగ్, తాత బిర్ సింగ్, తండ్రి హర్పాల్ సింగ్ అంతకు ముందు సైన్యంలో పనిచేశాయి. తరువాత 34 మీడియం రెజిమెంట్‌‌లోనూ, అక్కడ నుంచి 71 మీడియం రెజిమెంట్‌‌లో పోస్టింగ్ వచ్చింది. గిల్ వందో పుట్టిన రోజు సందర్భంగా భారత సైన్యం తరపున 71వ మీడియం రెజ్‌మెంట్ ఆయనకు కేక్ పంపింది. తనకు ఉన్న మంచి జ్ఞాపకాలలో ఒకటి 1965 భారత-పాకిస్తాన్ యుద్ధం అని అన్నారు. ‘మేము శత్రు శిబిరం నుంచి నాలుగు తుపాకులను పొందామని చెప్పారు. ఐదేళ్ల తరువాత అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌‌లో కల్నల్‌గా పదవీ విరమణ చేసిన గిల్.. అప్పటి నుంచి స్క్వాష్, హాకీ, టెన్నిస్‌తో బిజీగా గడిపినట్టు తెలిపారు.


బీజేపీపై ప‌వ‌న్‌కు ఉన్న చివ‌రి ఆశా పాయే... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉందా...?

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?

కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>