PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81d49abd-ad95-4483-933a-9d7894cdecb1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr81d49abd-ad95-4483-933a-9d7894cdecb1-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. గతంలో కేసీఆర్ ఆధిపత్యంతో ఏ లీడర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. తెలంగాణ వచ్చిన నాటినుండి మొన్నటి దుబ్బాక ఎన్నికల ముందు వరకు కేసీఆర్ చేసిందే శాశనం గా తయారైంది.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక లో ఓడిపోయి నిరాశలో ఉన్న కేసీఆర్ కి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలు పుండుమీద కారణం చాలినంత పనయ్యింది. kcr;amit shah;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;osmania general hospital;central government;leaderకేసీఆర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర బీజేపీ లో వణుకు పుట్టిస్తుందా..?కేసీఆర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర బీజేపీ లో వణుకు పుట్టిస్తుందా..?kcr;amit shah;kcr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;osmania general hospital;central government;leaderSat, 12 Dec 2020 19:00:00 GMTకేసీఆర్ ఆధిపత్యంతో ఏ లీడర్ వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. తెలంగాణ వచ్చిన నాటినుండి మొన్నటి దుబ్బాక ఎన్నికల ముందు వరకు కేసీఆర్ చేసిందే శాశనం గా తయారైంది.. అయితే   దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక లో ఓడిపోయి నిరాశలో ఉన్న కేసీఆర్ కి గ్రేటర్ లో వచ్చిన ఫలితాలు  పుండుమీద కారణం చాలినంత పనయ్యింది.

దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు.. కేంద్రం కూడా తెలంగాణ లో పాతుకుపోవడానికి రాష్ట్ర బీజేపీ నేతలకు ఊతంగా నిలుస్తుంది.. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ హేమాహేమీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరు కేసీఆర్ పై వ్యతిరేకత ను తేవడంలో మంచి ఫలితాలు సాధించారు. నిజానికి కేసీఆర్ పై  వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో  తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదంలో, శ్రీశైలం ప్రమాదం విషయం ఇలా అన్ని కేసీఆర్ కావాలని చేసినట్లుగా విపక్షాలు ఒక్కసారిగా దండెత్తాయి.. ఆ ప్రభావం ఇప్పుడు ఈ ఎన్నికలపై చూపాయి..

అలా ఈ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చగా మారింది. అయన ముందుగా షెకావత్‌తో ఆ తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.. వరద సాయంపై చర్చించారని. టీఆర్ఎస్ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. కానీ కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలతో… ఏకాంత సమావేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గా తెలుస్తోంది.దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రభావం కేసీఆర్ పై గట్టిగానే పడిందన్న అభిప్రాయం ఇప్పటికే తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉంది. ఆయన బీజేపీతో.. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ విధానాన్ని కోరుకుంటున్నారన్న చర్చ ప్రారంభమయింది. అయితే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్నందున… కేసీఆర్‌ ఆఫర్ చేసే దోస్తీని బీజేపీ పట్టించుకోదని కూడా చెబుతున్నారు.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>