PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-delivery-within-24-hoursb943ea18-79c1-4ba7-8db2-660a3f000daf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-delivery-within-24-hoursb943ea18-79c1-4ba7-8db2-660a3f000daf-415x250-IndiaHerald.jpgఫైజర్‌ కరోనా వ్యాక్సీన్‌కు అమెరికాలోనూ ఆమోద ముద్రపడింది. దీంతో 24 గంటల్లోనే వ్యాక్సీన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. అమెరికాలో ఇప్పటికే 30 లక్షల డోసుల ఫైజర్‌ వ్యాక్సీన్‌ అందుబాటులో ఉంది. ముందుగా హెల్త్‌కేర్‌ వర్కర్లు, కరోనాకు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వాళ్లకు వ్యాక్సీన్‌ ఇవ్వనున్నారు. vaccine delivery within 24 hours;canada;saudi arabia;american samoa;shakti24 గంటల్లోనే వ్యాక్సీన్‌ పంపిణీ !24 గంటల్లోనే వ్యాక్సీన్‌ పంపిణీ !vaccine delivery within 24 hours;canada;saudi arabia;american samoa;shaktiSat, 12 Dec 2020 17:03:03 GMT
ఫైజర్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సీన్‌ అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ - యూఎస్-ఎఫ్ డీఏ అనుమతి లభించింది. దీంతో ఫైజర్‌ వ్యాక్సీన్‌కు అనుమతిచ్చిన ఆరో దేశంగా అమెరికా నిలిచింది. ఇప్పటికే బ్రిటన్‌, బెహరైన్‌, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికోల్లో ఫైజర్‌ వ్యాక్సీన్‌కు అనుమతి లభించింది.  .

జర్మనీకి చెందిన ఫార్మసిటికల్‌ సంస్థ బయో-ఎన్ టెక్‌తో కలిసి కరోనా వ్యాక్సీను తయారు చేసింది ఫైజర్‌. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సీన్‌  వినియోగానికి అనుమతించాలంటూ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ-యూఎస్ ఎఫ్ డీఏకు ఇటీవల దరఖాస్తు చేసింది. వ్యాక్సీన్‌ భద్రత, పనితీరుల విషయంపై ఎఫ్ డీఏతో పాటు ఆ సంస్థతో సంబంధం లేని నిపుణులు కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

కరోనా బారిన పడిన వాళ్లకు చికిత్స అందించే క్రమంలో  ఫైజర్‌ వ్యాక్సీన్‌ మంచి ఫలితాలు ఇస్తోందని ఇప్పటికే రుజువైంది. వారం రోజుల తర్వాత ఇచ్చే రెండో డోసు వల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి.  ఫైజర్‌-బయో-ఎన్ టెక్‌ల వ్యాక్సీన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత 82 శాతం కరోనా నుంచి రక్షణ లభిస్తోంది. రెండో డోసు తర్వాత 95 శాతం వరకూ రక్షణ పెరుగుతుంది. ముఖ్యంగా బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల బీ-సెల్‌ రెస్పాన్స్‌ మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఫైజర్‌ తెలిపింది. కరోనా వైరస్‌ను అంతం చేయగల యాంటీ బాడీస్‌ సంఖ్య పెరుగుతుందని ఫైజర్‌ వివరించింది.

16 ఏళ్ల లోపు వాళ్లకు ఈ వ్యాక్సీన్‌ వినియోగానికి ఎఫ్ డీఏ అనుమతించ లేదు. ఈ వ్యాక్సీన్ వినియోగం వల్ల పదహారేళ్ల లోపు వాళ్లలో వచ్చే దుష్ప్రభావాలకు సంబంధించి తగిన సమాచారం అందుబాటులో లేదు. అలాగే, గర్భిణులకు ఇది ఎంత వరకూ శ్రేయస్కరం అనేది స్పష్టత కాలేదు. వ్యాక్సీన్‌ వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతినే అవకాశం ఉందని భయాలు వ్యక్తమయ్యాయి. దీంతో గర్భిణులకు ఫైజర్‌ వ్యాక్సీన్‌ వినియోగానికి అనుమతించలేదు.






బీజేపీపై ప‌వ‌న్‌కు ఉన్న చివ‌రి ఆశా పాయే... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉందా...?

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>