PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmala ramanaidu comments on reverse tendering -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmala ramanaidu comments on reverse tendering -415x250-IndiaHerald.jpgఏలూరు వింత వ్యాధి ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు కూడా రాలేదు. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా జగన్ ప్రభుత్వం, ఇంత వరకు ఏలూరు వింత వ్యాధి కారణాలను గుర్తించ లేకపోయింది అని ఆయన అన్నారు.nimmala ramanaidu, jagan, ap;jagan;chief minister;mla;aqua;tdp;v;mantraఏలూరు వింత వ్యాధి మంత్రులకు వచ్చిందా...?ఏలూరు వింత వ్యాధి మంత్రులకు వచ్చిందా...?nimmala ramanaidu, jagan, ap;jagan;chief minister;mla;aqua;tdp;v;mantraSat, 12 Dec 2020 15:27:31 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా జగన్ ప్రభుత్వం, ఇంత వరకు ఏలూరు వింత వ్యాధి కారణాలను గుర్తించ లేకపోయింది అని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని వేధించడంపై, ప్రజలపై పన్నులభారం వేయడంపై పెట్టిన శ్రద్ధను ప్రభుత్వం ప్రజారోగ్యంపై పెడితే, ఏలూరు  ఘటన ఉత్పన్నమయ్యేది కాదు అని ఆయన వెల్లడించారు. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వింత వ్యాధి వారికి వచ్చిందేమోనని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన విమర్శించారు. వింత వ్యాధి భాధితులను తూతూమంత్రంగా పరామర్శించిన ముఖ్యమంత్రి, సమస్య తీవ్రతను గుర్తించడంలో,  అధికారులు, సంబంధిత శాఖలతో పనిచేయించడంలో ఘోరంగా విఫలమయ్యారు అని ఆయన మండిపడ్డారు.

ఏలూరు ఘటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే,  ప్రత్యేక బృందాలు, హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ వంటి వాటిని ఏర్పాటు చేయడం, , శానిటైజేషన్ చర్యలు చేపట్టడం,  యుద్ధ ప్రాతిపదికన రక్త నమూనాలు సేకరించడం వంటి పనులు ఎందుకు చేయలేకపోయింది? అని ఆయన ప్రశ్నించారు. ఎయిమ్స్, ఐఐసీటీ వంటి సంస్థల నివేదికలను జగన్ ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు?  అని ఆయన నిలదీశారు. వింత వ్యాధితో సంభవించిన మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు గానే పరిగణించాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం కోసం, టీడీపీ ప్రభుత్వం రూ.23 వేల కోట్లతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను జగన్ అధికారంలోకి రాగానే నిలిపివేశాడు అని విమర్శించారు. ఏలూరు వింత వ్యాధి రాష్ట్రమంతా ప్రబలకముందే ప్రభుత్వ మేల్కోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.


ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?

కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం.. అమిత్ షాను ఆ సాయం అడిగిన కేసీఆర్

ఎమోషనల్ అయిన వరుణ్ కారణం ఇందుకేనట?

కేసీఆర్ రెండోసారి పాలనకు రెండేళ్లు: కొన్ని మెరుపులు...ఎన్నో మరకలు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>