PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupatibyelectionbjpcontesting00f42754-83ac-4f1a-9a52-f92ffd4069e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupatibyelectionbjpcontesting00f42754-83ac-4f1a-9a52-f92ffd4069e6-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనున్న తరుణంలో బీజేపీ- జనసేన కూటమి తరఫున ఏ పార్టీ బరిలో దిగే అంశంలో క్లారిటీ వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన బలపరిచే.. బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో శోభాయాత్ర అనంతరం సోము వీర్రాజు చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది బీజేపీనే అని తేల్చి చెప్పారు. తమ పార్టీకి జనసేన మద్దతు ఇస్తుందని వెల్లడించారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనbjp;kalyan;tiru;delhi;hyderabad;bharatiya janata party;jagan;janasena;government;tirupati;husband;cheque;ycp;janasena party;partyతిరుపతి లో బీజేపీ పోటీతిరుపతి లో బీజేపీ పోటీbjp;kalyan;tiru;delhi;hyderabad;bharatiya janata party;jagan;janasena;government;tirupati;husband;cheque;ycp;janasena party;partySat, 12 Dec 2020 23:42:06 GMTతిరుపతి లో బీజేపీ పోటీ

తిరుపతి ఉప ఎన్నిక త్వరలో జరగనున్న తరుణంలో బీజేపీ- జనసేన కూటమి తరఫున ఏ పార్టీ బరిలో దిగే అంశంలో క్లారిటీ వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన బలపరిచే.. బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ వ్యాఖ్యానించారు. తిరుపతిలో శోభాయాత్ర అనంతరం సోము వీర్రాజు చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది బీజేపీనే అని తేల్చి చెప్పారు. తమ పార్టీకి జనసేన మద్దతు ఇస్తుందని వెల్లడించారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తిరుపతి టికెట్ తమకు వదిలేయాలంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి విన్నవించారు. అంతేకాకుండా తిరుపతిలో జనసేనాని పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కూడా నింపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకోవడంతో తిరుపతి టికెట్ అయినా జనసేనకు వస్తుందని భావిస్తున్నారు. కానీ, తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇదిలా ఉండగా తిరుపతిని అభివృద్ధి చేసింది బీజేపీనేనంటూ ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగిపోయిందని వీర్రాజు విమర్శించారు. ఇక తిరుమల శ్రీవారికి ఇచ్చిన విరాళాలను సైతం సీఎం జగన్ తమ ఖాతాలో వేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్‌లో జగన్ అవినీతికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో కుటుంబ పార్టీల పాలనకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని గెలిపిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తామని తిరుపతి ప్రజలకు సోము వీర్రాజు హామీ ఇచ్చారు.



బుల్లి తెరపైకి జూనియర్ ఎన్టీఆర్..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>