SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-zoom-jamili-elections-tdp-ycp-jagan-modi9048f1a4-b36d-4e04-bab7-68cbc7f6b18c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-zoom-jamili-elections-tdp-ycp-jagan-modi9048f1a4-b36d-4e04-bab7-68cbc7f6b18c-415x250-IndiaHerald.jpgచంద్రబాబు లెక్కేమిటంటే వైసీపీ-టీడీపీల మధ్య ఓట్లశాతం 10.78. ఇందులో ఓ 5శాతం ఓట్లను టీడీపీ లాగేసుకుంటే వైసీపీ అధికారంలో నుండి పడిపోయి ఇంటికెళిపోతుందట. ఎప్పటిదో 30 ఏళ్ళ క్రితం నాటి కాకిలెక్కలతోనే చంద్రబాబు ఇంకా నెట్టుకొస్తున్నట్లున్నది చూస్తుంటే. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకన్నా వైసీపీకి 10.78 శాతం ఓట్లు అదనంగా వచ్చిన విషయం తెలిసిందే. 10.78 శాతం ఓట్లు అదనంగా అంటే 151 సీట్ల అఖండ మెజారిటి. వైసీపీకి 49.95 శాతం ఓట్లొస్తే టీడీపీకి వచ్చింది 39.17 శాతం ఓట్లు. రెండుపార్టీల మధ్య తేడాలో టీడీపీ 5 శాతం లాగేయాలనnaidu zoom jamili elections tdp ycp jagan modi;cbn;amala akkineni;tiru;bharatiya janata party;telugu desam party;jagan;telugu;government;tirupati;court;industry;husband;tdp;success;ycp;partyహెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు లెక్కలన్నీ ఇలాగే ఉంటాయా ?హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు లెక్కలన్నీ ఇలాగే ఉంటాయా ?naidu zoom jamili elections tdp ycp jagan modi;cbn;amala akkineni;tiru;bharatiya janata party;telugu desam party;jagan;telugu;government;tirupati;court;industry;husband;tdp;success;ycp;partySat, 12 Dec 2020 07:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వేసుకునే లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఏదో భ్రమల్లో ముణిగిపోయి ప్రత్యర్ధులను చాలా తక్కువగా అంచనా వేయటం తర్వాత బోల్తాపడటం అలవాటైపోయింది. ఒకసారి రెండుసార్లు లెక్కలు తప్పాయంటే అర్ధముంది. కానీ ప్రతిసారి ఇలాగే లెక్కలు తప్పటం బోల్తాపడుతున్నా పాఠాలు నేర్చుకోకపోతే చంద్రబాబును ఏమనుకోవాలి ? తాజాగా తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విషయంలో నేతలకు  చంద్రబాబు చెప్పిన లెక్క ఈ విధంగా ఉంది. వైసీపీ నుండి తాము లాక్కోవాల్సిన ఓట్లశాతం గురించి చెప్పిన లెక్క బాగానే ఉంది. కానీ ఇదే సమయంలో తమనుండి ఓట్లను లాక్కోవాలని బీజేపీ వేస్తున్న లెక్కల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా.




చంద్రబాబు లెక్కేమిటంటే వైసీపీ-టీడీపీల మధ్య ఓట్లశాతం 10.78.  ఇందులో ఓ 5శాతం ఓట్లను టీడీపీ లాగేసుకుంటే వైసీపీ అధికారంలో నుండి పడిపోయి ఇంటికెళిపోతుందట. ఎప్పటిదో 30 ఏళ్ళ క్రితం నాటి కాకిలెక్కలతోనే చంద్రబాబు ఇంకా నెట్టుకొస్తున్నట్లున్నది చూస్తుంటే. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకన్నా  వైసీపీకి 10.78 శాతం ఓట్లు అదనంగా వచ్చిన విషయం తెలిసిందే. 10.78 శాతం ఓట్లు అదనంగా అంటే 151 సీట్ల అఖండ మెజారిటి. వైసీపీకి 49.95 శాతం ఓట్లొస్తే టీడీపీకి వచ్చింది 39.17 శాతం ఓట్లు. రెండుపార్టీల మధ్య తేడాలో టీడీపీ 5 శాతం లాగేయాలన్నది చంద్రబాబు లెక్క. అసలు ఇన్ని ఓట్లు తెలుగుదేశంపార్టీ వైపు ఎందుకు రావాలి ? ఎలా వస్తాయన్న విషయంలో మాత్రం చంద్రబాబు దగ్గర సమాధానం లేదు.




అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమలు చేస్తున్న సంక్షేమపథకాలతో జగన్మోహన్ రెడ్డికి జనాల్లో సానుకూలత పెరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగినా అవేవీ ప్రజలకు నష్టం జరిగేవి కావు. పైగా ప్రజల సంక్షేమం కోసం జగన్ అమలు చేద్దామని అనుకున్న ఇళ్ళపట్టాలు, ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడం, మూడురాజధానుల ఏర్పాటు వంటివాటిని చంద్రబాబే తన మద్దతుదారులతో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నాడనే విషయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. కాబట్టి టీడీపీకి కూడా మైనస్ జరిగే అవకాశాలున్నాయన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. అలాగే టీడీపీని దెబ్బకొట్టాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన ప్రయత్నాల్లో బీజేపీ సక్సెస్ అయితే వైసీపీ నుండి ఓట్లు రావటం కాదు ముందు టీడీపీ నుండి ఓట్లు పోకుండా కాపాడుకోవటం చంద్రబాబుకు కష్టమే.




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>