EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congresse2d66904-a0e2-46e4-a8ed-9769ba472054-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congresse2d66904-a0e2-46e4-a8ed-9769ba472054-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఆషామాషీగా లేదు. ఎప్పుడూ.. ఏదో ఒక అంశం ఆ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకుంటూనే రచ్చరచ్చ జరుగుతూ ఉంటుంది. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ లో సాధారణ వ్యవహారంగా మారిపోయింది. 2014 ఎన్నికలు దగ్గర నుంచి చూసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అన్ని ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పై ముద్ర పడిపోయింది. అలాగే సీనియర్ నాయకులు ఆ పార్టీలో ఎక్కుcongress bjp manikayam tagore revanth reddy uttam;auto;nithya new;revanth;sridhar;venkat;delhi;telangana;revanth reddy;congress;mla;letter;janareddy;sangareddy;jagga reddy;reddy;v;party;mantraఎడిటోరియల్ : తెలంగాణ కాంగ్రెస్ లో లొల్లి ..? మళ్లీ మళ్లీ ?ఎడిటోరియల్ : తెలంగాణ కాంగ్రెస్ లో లొల్లి ..? మళ్లీ మళ్లీ ?congress bjp manikayam tagore revanth reddy uttam;auto;nithya new;revanth;sridhar;venkat;delhi;telangana;revanth reddy;congress;mla;letter;janareddy;sangareddy;jagga reddy;reddy;v;party;mantraSat, 12 Dec 2020 16:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఆషామాషీగా లేదు. ఎప్పుడూ.. ఏదో ఒక అంశం ఆ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకుంటూనే రచ్చరచ్చ జరుగుతూ ఉంటుంది. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ లో సాధారణ వ్యవహారంగా మారిపోయింది. 2014 ఎన్నికలు దగ్గర నుంచి చూసుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా,  అన్ని ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ పై ముద్ర పడిపోయింది. అలాగే సీనియర్ నాయకులు ఆ పార్టీలో ఎక్కువగా ఉండడం, ఎవరికివారు గొప్ప లీడర్లు అనుకోవడం,  అధిష్టానం దగ్గర ఎవరికి వారికి పలుకుబడి ఉండటం, ఆ బలం చూసుకుని ఎవరికి వారు తామే గొప్ప నాయకులము అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటి వ్యవహారాలతో నిత్యం నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు  ఏర్పడుతున్నాయి. 





ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నా, ఆ పరిస్థితుల్లో మార్పు అయితే రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపైనే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ పదవిని ఆశిస్తున్న వారిలో రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జానా రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు ఇలా చాలా మంది ఉన్నారు. వీరిలో ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి అనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్యేలు , ఎంపీలు మాజీ మంత్రులు కీలక నాయకులు అందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. 





ఈరోజు అధిష్టానానికి నివేదిక అందించేందుకు ఢిల్లీ కూడా ఆయన వెళ్ళబోతున్న నేపథ్యంలో ఆకస్మాత్తుగా ఎవరినీ సంప్రదించకుండానే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను త్వరలోనే పాదయాత్ర చేపట్టబోతున్నాను అంటూ స్వయంగా ప్రకటించడం ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించకపోవడం వంటి వ్యవహారాలు మళ్లీ కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్నాయి. 



నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>