MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-actresses-who-are-living-single-after-divoircebf4c3bd4-989f-409d-ba06-f2a2160e95d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-actresses-who-are-living-single-after-divoircebf4c3bd4-989f-409d-ba06-f2a2160e95d8-415x250-IndiaHerald.jpgసినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందులోకి ప్రవేశించాక పేరు, ప్రఖ్యాతలతో పాటు మనకంటూ ఒక గుర్తింపు కూడా లభిస్తుంది. అలా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న, రియల్ లైఫ్ లో ఓడిపోయిన హీరోయిన్స్ చాలామందినే ఉన్నారు. భర్తలను వదిలేసి..జీవితం అంత ఒంటరిగానే గడుపుతున్న హీరోయిన్స్ వీళ్ళేtollywood heroines;nri;pawan;kamal hassan;revathi;sarika;sharada;shruti;shruti haasan;sukanya;adarsh;amala paul anaka;bhanu;jeevitha rajaseskhar;kalyan;prema;prithy;raghu;raghuvaran;renu desai;sruthi;vijay;variar;bollywood;tollywood;cinema;rajani kanth;marriage;love;director;heroine;success;joseph vijay;nayak;akira nandhan;iddarammailathoభర్తలను వదిలేసి..జీవితం అంత ఒంటరిగానే గడుపుతున్న హీరోయిన్స్ వీళ్ళేభర్తలను వదిలేసి..జీవితం అంత ఒంటరిగానే గడుపుతున్న హీరోయిన్స్ వీళ్ళేtollywood heroines;nri;pawan;kamal hassan;revathi;sarika;sharada;shruti;shruti haasan;sukanya;adarsh;amala paul anaka;bhanu;jeevitha rajaseskhar;kalyan;prema;prithy;raghu;raghuvaran;renu desai;sruthi;vijay;variar;bollywood;tollywood;cinema;rajani kanth;marriage;love;director;heroine;success;joseph vijay;nayak;akira nandhan;iddarammailathoSat, 12 Dec 2020 13:00:00 GMTసినిమా అంటేనే రంగుల ప్రపంచం. అందులోకి ప్రవేశించాక పేరు, ప్రఖ్యాతలతో పాటు మనకంటూ ఒక గుర్తింపు కూడా లభిస్తుంది. అలా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న, రియల్ లైఫ్ లో ఓడిపోయిన హీరోయిన్స్ చాలామందినే ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది  హీరోయిన్లు వాళ్ళ నిజం జీవితంలో ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన  హీరోయిన్స్ యొక్క వైవాహిక జీవితాలు సాఫీగా సాగలేదు. అంటే పెళ్లి అయిన తర్వాత భర్తతో గొడవలు పడి విడిపోయిన హీరోయిన్స్ మన  ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ అయితే భర్తలతో విడిపోయిన తర్వాత ఇంకొకరిని రెండవ వివాహం చేసుకొన్న వారు కూడా ఉన్నారు.అయితే  మరికొందరు మాత్రం భర్తతో విడిపోయాక కూడా రెండవ  వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు. అలా  భర్తతో తెగతెంపులు చేసుకుని ఒంటరి జీవితం గడుపుతున్న ఆ నటీమణులు ఎవరో తెలుసుకుందాం.. !!


భర్తతో విడిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న హీరోయిన్స్ లో మొదటగా భానుప్రియ గురించి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు భానుప్రియ  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అందరి అగ్ర హీరోల సరసన నటించింది. అయితే భాను సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాకి వెళ్లిపోయింది. అయితే ఒక పాప పుట్టిన తర్వాత వీరి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2005లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన కూతురుతో కలిసి జీవిస్తోంది. అలాగే మరొక  సీనియర్ హీరోయిన్ రజినీ కూడా భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా గడుపుతోంది. సౌత్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒక ఎన్నారై ని వివాహం చేసుకున్న రజిని ఆస్తి గొడవల వలన విడాకులు తీసుకుంది. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా ఆఫర్స్ రాలేదు. కాకపోతే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించింది. అలాగే 'నరసింహనాయుడు' 'తమ్ముడు' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రీతీ జింగానియా వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. బాలీవుడ్ డైరెక్టర్ పర్వీన్ డబ్బస్ ని వివాహం చేసుకున్న ప్రీతి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఒంటరి జీవితం గడుపుతోంది.

ఇక హీరోయిన్ సారిక కూడా కమల్ హాసన్ తో విడిపోయి ఒంటరిగా గడుపుతోంది. కమల్ హాసన్ గౌతమితో రిలేషన్ కొనసాగించినా సారిక మాత్రం శృతి హాసన్ - అక్షర హసన్ లను చూసుకుంటూ మరో పెళ్లి చేసుకోలేదు..ఇక నాయక్' 'ఇద్దరమ్మాయిలతో' 'రఘువరన్ బీటెక్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ జీవితం కూడా సాఫీగా సాగలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.అమలాపాల్ తో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ మరో వివాహం చేసుకున్నాడు. అమలాపాల్ మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా గడుపుతోంది. ఇంకా పవన్ కళ్యాణ్ తో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, పెళ్లి చేసుకున్న  రేణు దేశాయ్ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదని చెప్పాలి. వీరికి అకిరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. వీరితో పాటు సీనియర్ నటీమణులు శారద - రేవతి - రమాప్రభ - ప్రేమ - సుకన్య - అంబికా ప్రియరామన్ - మంజు వారియర్ వంటి నటీమణుల వైవాహిక జీవితాలు కూడా ఇలా ఒంటరిగానే మిగిలిపోయాయి. సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన వీరి జీవితాలలో ఇలాంటి సంఘటలు కొంచెం బాధాకరమైనవి అనే చెప్పాలి.. !!


అసాంఘిక శక్తుల అడ్డాగా వైసీపీ! పోలీసులపై నమ్మకం పోయిందన్న చంద్రబాబు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>