Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/workers-eloped-with-linkpondc562c720-e57f-4fc9-93cc-f1edb13c66df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/workers-eloped-with-linkpondc562c720-e57f-4fc9-93cc-f1edb13c66df-415x250-IndiaHerald.jpgఉన్నట్లుండి మీకు కోట్ల రూపాయల విలువైన ధనరాసులు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు..? మీ కోరికలు సరే.. అవి మీకు దొరికాయన ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తారు..? కచ్చితంగా వాటిని తీసుకుని పారిపోతారు. అదే ఆ సంపద పురావస్తు కాలానికి చెందనదని తెలిస్తే.. అయినా పారిపోతారా..? మీరేమో కానీ యూపీలోని...gold coins;sampada;kanpur;district;police;airపొలంలో లంకెబిందెలు.. పారిపోయిన కూలీలుపొలంలో లంకెబిందెలు.. పారిపోయిన కూలీలుgold coins;sampada;kanpur;district;police;airSat, 12 Dec 2020 11:17:05 GMTకాన్పూర్: ఉన్నట్లుండి మీకు కోట్ల రూపాయల విలువైన ధనరాసులు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు..? మీ కోరికలు సరే.. అవి మీకు దొరికాయన ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తారు..? కచ్చితంగా వాటిని తీసుకుని పారిపోతారు. అదే ఆ సంపద పురావస్తు కాలానికి చెందనదని తెలిస్తే.. అయినా పారిపోతారా..? మీరేమో కానీ యూపీలోని కూలీలు మాత్రం అదే చేశారు. మెఘలుల కాలం నాటి సంపద దొరకడంతో వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా తీసుకుని పారిపోయారు.

యూపీలోని కాన్పూర్‌లోని ఒక పొలంలో తవ్వకాలు జరుపుతుండగా మొఘలుల కాలంనాటి లంకెబిందె దొరికింది. ఆ బిందె నిండా బంగారు నాణేలతో నిండి ఉంది. కూలీలకు బంగారు నాణేల పాత్ర దొరికిందనే వార్త గ్రామమంతా ఒక్కసారిగా గ్రామం మొత్తం పాకింది. అయితే ఈ నాణేల పాత్రను చూసిన కొందరు కూలీలు వాటిని పంచుకుని గ్రామం నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. పురావస్తు సంపదను ప్రభుత్వానికి అప్పగించాల్సింది పోయి వాటిని తీసుకుని పారిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి సంపదను కాపాడాలని కోరారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా.. సురార్ గ్రామానికి చెందిన బ్రజ్ కిషోర్ పాండేకు గ్రామం బయట కొంత పొలం ఉంది. ఆ పొలంలో మొక్కలు నాటించేందుకు భూమి పనులు చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరుపుతున్న కూలీలకు ఒక మట్టిపాత్ర లభ్యమయ్యింది. దానిలోని నాణేలను బ్రజ్ కిషోర్ పాండేతో పాటు కూలీలు పంచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

నాణేలతో పరారైన బ్రజ్ కిషోర్, కూలీలపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికోసం గాలింపు ప్రారంభించారు. వారిని వెతికి పట్టకుని, వారి నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. సదరు పొలం యజమానితో పాటు ఇతర కూలీల నుంచి మొఘలుల కాలం నాటి 35 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నాణేలపై రాసి ఉన్న ఉర్దూ భాష ఆధారంగానే అవి మొఘలుల కాలం నాటి నాణేలుగా గుర్తించారు.


టీడీపీ నేత‌ల స్వార్థ రాజ‌కీయాల‌కు పార్టీ బ‌లి...!

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>