Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/family-planning19dd5a8e-8d34-48a4-a3b8-c8186abff967-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/family-planning19dd5a8e-8d34-48a4-a3b8-c8186abff967-415x250-IndiaHerald.jpgపెరుగుతున్న దేశ జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనికి సమాధానంగా... family planning;amala akkineni;kumaar;aswini;delhi;bharatiya janata party;lawyer;population;central governmentకుటుంబ నియంత్రణపై కేంద్రం షాకింగ్ కామెంట్స్కుటుంబ నియంత్రణపై కేంద్రం షాకింగ్ కామెంట్స్family planning;amala akkineni;kumaar;aswini;delhi;bharatiya janata party;lawyer;population;central governmentSat, 12 Dec 2020 21:31:22 GMTకేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనికి సమాధానంగా కేంద్రం కప్పడా ఓ అఫిడవిట్ ను అత్యున్నత ధర్మసనానికి సమర్పించింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దేశంలో జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.     

వెంటనే కేంద్రం చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు మొదట ఢిల్లీ హై కోర్ట్ లో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యాజ్యాన్ని హై కోర్టు కొట్టిపారేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. సుప్రీం కోరిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సవివరంగా అఫిడవిట్ ను దాఖలు చేసింది.     

 ప్రజలపై కుటుంబ నియంత్రణను నిర్బంధంగా రుద్దడానికి తాము వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. పిల్లల్ని కనడంపై నిర్బంధ ఆదేశాలు ఇస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయని, జనాభా అసమానతలకు దారి తీస్తుందని తెలిపింది. మన దేశంలో కుటుంబ సంక్షేమం స్వభావ రీత్యా స్వచ్ఛందంగా పాటించవలసిన విషయమని, అందులో ప్రభుత్వ జోక్యం సరికాదని వివరించింది. దేశం సమగ్రమైన జాతీయ జనాభా విధానాన్ని అమలు చేస్తోందని, ఈ విధానంలో లక్ష్యాలు, ఆపరేషనల్ వివరంగా ఉన్నాయని తెలిపింది.     

అంతే కాకుండా ప్రజారోగ్యం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపింది. సామాన్యులను ఆరోగ్య సంబంధిత ప్రమాదాల నుంచి కాపాడటం కోసం ఆరోగ్య రంగంలో సంస్కరణలను తగిన రీతిలో, సుస్థిరమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని తెలిపింది. ఆరోగ్య రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు నాయకత్వం వహించాలని పేర్కొంది. ఆరోగ్య రంగంలో రాష్ట్రాల నేతృత్వంలో జరిగే సంస్కరణల ద్వారా ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.     


తెలంగాణలో 6 ఎయిర్ పోర్టులకు అనుమతివ్వండి

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>