MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/junior-ntr-on-the-bully-screenb66fdaa7-9011-4eff-a689-34042c019e04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/junior-ntr-on-the-bully-screenb66fdaa7-9011-4eff-a689-34042c019e04-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపైకి వస్తున్నాడు. రియాలిటీ షో బిగ్‌బాస్‌ తారక్‌తో మొదలైన సంగతి తెలిసిందే. తొలి అడుగులోనే అదరగొట్టేసిన తారక్‌ మరోసారి హోస్ట్‌ అవతారం ఎత్తుతున్నాడు. రేటింగ్‌లో వెనుకబడిన ఓ ఛానల్‌ ఎన్టీఆర్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. junior ntr on the bully screen;ntr;nagarjuna akkineni;annapurna;jr ntr;yajamanya;cinema;bigboss;television;reality show;nandamuri taraka rama rao;geminiబుల్లి తెరపైకి జూనియర్ ఎన్టీఆర్..?బుల్లి తెరపైకి జూనియర్ ఎన్టీఆర్..?junior ntr on the bully screen;ntr;nagarjuna akkineni;annapurna;jr ntr;yajamanya;cinema;bigboss;television;reality show;nandamuri taraka rama rao;geminiSat, 12 Dec 2020 23:45:00 GMTరియాలిటీ షో బిగ్‌బాస్‌ తారక్‌తో మొదలైన సంగతి తెలిసిందే. తొలి అడుగులోనే అదరగొట్టేసిన తారక్‌ మరోసారి హోస్ట్‌ అవతారం ఎత్తుతున్నాడు. రేటింగ్‌లో వెనుకబడిన ఓ ఛానల్‌ ఎన్టీఆర్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట.

బిగ్‌బాస్‌ మూడు, నాలుగు సీజన్స్‌ హోస్ట్‌గా నాగార్జున  ఓకె అనిపించుకున్నా.. ఇప్పటికీ ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను తలుస్తూనే ఉంటారు. తారక్‌లో ఉన్న స్పాంటినిటీ.. ఎక్స్‌ప్రెషన్స్‌.. టైమింగ్‌ ఒకటేంటి.. అన్నిరకాల క్యాపబిలిటీస్‌ ఆడయన్స్‌ను కట్టిపడేశాయి. తారక్‌ హోస్ట్‌గా వ్యవహరించడం వలనో.. లేదంటే.. తెలిసిన పార్టిస్‌పెంట్స్‌ ఉండడం వలనో బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ ప్రేక్షకుల్లో నిలిచిపోయింది.

తారక్ ఇచ్చిన స్ఫూర్తితో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ వరకు వచ్చాడు. బిగ్‌బాస్‌ 'స్టార్‌ మా'కు పేరుతోపాటు రేటింగ్‌ తీసుకొచ్చాడు. మరోవైపు సీరియల్స్‌ కూడా పాపులర్‌ కావడంతో.. రేటింగ్‌లో 'స్టార్‌ మా' టాప్‌ పొజిషన్‌కు చేరింది. దశాబ్దం క్రితం నెంబర్‌ఒన్‌గా వున్న జెమిని రేటింగ్స్‌లో వెనుకపడిపోయింది. పూర్వవైభవం కోసం యాజమాన్యం..  తారక్‌ను రంగంలో దింపుతోంది.  ఎన్టీఆర్‌తో రియాలిటీ షో గానీ.. టాక్‌ షోగానీ ప్లాన్‌ చేసి హోస్ట్‌గా ఆయన్ని ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారట. ఆల్ రెడీ ఈ షోకు సంబంధించి  అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌  పనులు జరుగుతున్నాయని సమాచారం.

తారక్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తన పార్ట్‌ పూర్తికాగానే.. త్రివిక్రమ్‌ మూవీ చేస్తూ.. హోస్ట్‌ అవతారం ఎత్తుతాడట.  మూడేళ్ల క్రితమే.. బిగ్‌బాస్‌ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 50 లక్షలు తీసుకున్నాడని టాక్‌ నడిచింది. ఆల్ రెడీ  సక్సెస్‌ఫుల్‌ హోస్ట్ కాబట్టి.. పెరిగిన క్రేజ్‌ రీత్యా.. రెమ్యునరేషన్‌ రోజుకు 50 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది.

మొత్తానికి మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టు కనిపిస్తోంది. తారక్ ను జెమినీ టీవీ యాజమాన్యం ఒప్పించిందే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రేటింగ్ కోసమే ఇదంతా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హో్స్ట్ గా ఆయన మంచి ప్రతిభ కనుబరచడంతో ఆ టీవీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.






ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>