PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-target-changesa6e2a354-9aef-4993-afa6-71dd029dc760-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-target-changesa6e2a354-9aef-4993-afa6-71dd029dc760-415x250-IndiaHerald.jpgతెలంగాణ సర్కార్ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. వీటిని టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర బలంగా ప్రస్తావించడం లేదని కస్సుమంటున్నారట. ఈ అంశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ ప్లానింగ్ క్లిక్ అవుతుందో లేదో చూడాలి.bandi sanjay target changes;kcr;varsha;bharatiya janata party;telangana;chief minister;central government;partyబండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?bandi sanjay target changes;kcr;varsha;bharatiya janata party;telangana;chief minister;central government;partySat, 12 Dec 2020 11:00:00 GMTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... తన స్వరానికి పదును పెంచుతున్నారు. పాయింట్ టు పాయింట్ చెప్పి .. విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించిన బండి సంజయ్. అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అంటూ ప్రశ్నించిన సందర్భాలు చూశాం. ఆ తర్వాత ఎంఐఎం నాయకులపై కూడా ఘాటుగా స్పందించారు సంజయ్. ఎంఐఎం పై పెద్ద ఎత్తున మండిపడుతూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇప్పుడేమో టీఎన్జీవో నేతలను టార్గెట్ చేసి విమర్శల బాణాలను విసురుతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై  ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ చేపట్టిన.. రైతు సంఘాల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఎన్జీవో అలా  మద్దతు  పలికిందో లేదో.. వీరిపై బిజేపి నాయకులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు.. వారిని గౌరవిస్తూ... రైతులకు మేలు చేకూర్చాలని మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం అంటూ ముందుకొచ్చి టీఎన్జీవో ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు బండి సంజయ్.

ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులంటే చాలు చెడామడా విమర్శిస్తున్నారు బండి సంజయ్. వారి ఊసెత్తితేనె కస్సుమంటూ బుసలు కొడుతున్నారు. మిగిలిన ప్రతిపక్ష నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంజయ్....తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులంటే చాలు ఏకంగా విమర్శల తుఫాను వెదజల్లుతున్నారు. రైతుల కోసం టీఎన్జీవో మద్దతు పలకడం పై... సంజయ్ ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు రైతులకు..ఉద్యోగ సంఘాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాల పై భిన్నంగా వ్యవహరిస్తున్నారు సంజయ్. గతంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఉద్యోగ సంఘాలను ఇలా విమర్శించలేదు... ఇంకా వీలైతే వారి మద్దతు కోసం వెంటపడతారు.

అలాంటిది రైతుల కోసం మీరు స్పందించడం ఏంటి..?? అంటూ బండి సంజయ్ ఉద్యోగ సంఘాలను ప్రశ్నించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. వీటిని టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర బలంగా ప్రస్తావించడం లేదని కస్సుమంటున్నారట. ఈ అంశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ ప్లానింగ్ క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఏదేమైనా ఉద్యోగ సంఘాల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ గా మారి తెలంగాణ రాజకీయ రంగాన్ని మరి కాస్త  వేడెక్కించాయి.


పొలంలో లంకెబిందెలు.. పారిపోయిన కూలీలు

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>