MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-love-storyf8735d9c-cb65-4067-848c-1957769bb1c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-love-storyf8735d9c-cb65-4067-848c-1957769bb1c2-415x250-IndiaHerald.jpgరోజా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. తన నవ్వుతో ఎంతటి వాళ్ళని అయిన ఇట్టే మాయ చేస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో టాప్ పోసిషన్ లో ఉన్న హీరోయిన్స్ లో రోజా కూడా ఒకరు. దాదాపు అందరి అగ్ర హీరోల పక్కన ఆడి,పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది.roja love story;jeevitha rajaseskhar;maya;prema;roja selvamani;audi;roja;cinema;telugu;tamil;marriage;love;director;girl;heroineరోజాని పెళ్లి చేసుకోవడానికి ఏమి ప్లాన్ వేసావ్ తమిళ్ బయ్యా.. !!రోజాని పెళ్లి చేసుకోవడానికి ఏమి ప్లాన్ వేసావ్ తమిళ్ బయ్యా.. !!roja love story;jeevitha rajaseskhar;maya;prema;roja selvamani;audi;roja;cinema;telugu;tamil;marriage;love;director;girl;heroineSat, 12 Dec 2020 11:00:46 GMTరోజా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. తన నవ్వుతో ఎంతటి వాళ్ళని అయిన ఇట్టే మాయ చేస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో టాప్ పోసిషన్ లో ఉన్న హీరోయిన్స్ లో రోజా కూడా ఒకరు. దాదాపు అందరి అగ్ర హీరోల పక్కన ఆడి,పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. మెల్లగా సినిమాల్లో నటించడం మానేసి రాజకీయాల వైపు వెళ్లిపోయారు. అక్కడ కూడా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుని వరుస విజయాలతో ముందుకు దూసుకువెళుతుంది రోజా.ఇంకా రోజా వ్యక్తిగత విషయానికి వస్తే.. రోజా ఒక తమిళ దర్శకుడిని పదేళ్ల పాటు ప్రేమించి, ఇంట్లో ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు అందరికి సుపరిచుతుడే. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సెల్వమణి.

మొదట్లో సెల్వమణి పేరు  తెలుగులో ఎవరికీ తెలియదు కానీ  రోజాని పెళ్లి చేసుకోవడం వల్ల రోజా భర్తగా తెలుగులో పాపులర్ అయ్యాడు. ఎందుకంటే సెల్వమణి తమిళ దర్శకుడు అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు.. అలాగే తమిళనాట కూడా రోజా కూడా అంతగా ఎవరికీ తెలియదు.  అక్కడ రోజాని  కేరాఫ్ సెల్వమణి అంటారు. ఎందుకంటే రోజా తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల సెల్వమణి భార్యగా అక్కడ తమిళ నట పాపులర్ అయింది. అయితే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత రోజా సెల్వమణిలు ఇద్దరు రెండు రాష్ట్రాల అభిమానులకు చేరువయ్యారు. అసలు వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది?  పెళ్లి ఎలా జరిగిందో అన్నా విషయాలు తెలుసుకుందాం.. మన సినీ ఇండస్ట్రీలో ఇలా హీరోయిన్స్, దర్శకులను పెళ్లి చేసుకున్నవారు చాలామందిని ఉన్నారు. వాళ్లలో రోజా సెల్వమణి కూడా ఒక జంట.  మాములుగా తమకు నచ్చిన హీరోయిన్ల మనసు గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. రోజాతో  ఈయన  పెళ్లి జరగడానికి ముందు చాలా పెద్ద కథ జరిగిందట.రోజా  ప్రేమను గెలవడానికి సెల్వమణి చాలా పెద్ద ప్లాన్ వేసాడు తన డైరెక్టర్ మైండ్ ను ఉపయోగించి రోజాని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో రోజాతో సెల్వమణి  చాలా సినిమాలు చేసాడు. ఆ సమయంలోనే  ఆమెతో ప్రేమలో  పడిపోయాడు. అయితే ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ ఉంది.. అదేంటంటే తాను ప్రేమించిన విషయం ముందు రోజాకు చెప్పలేదు సెల్వమణి..తన ప్రేమ విషయం  ముందుగా  రోజా వాళ్ళ ఇంట్లో చెప్పాడట. రోజా అమ్మానాన్నలని ఒప్పిస్తే చాలు ఆ తర్వాత ఆమె ఈజీగా ఒప్పుకుంటుందని తెలిసి,  దర్శకత్వ ప్రతిభను చూపించాడు  సెల్వమణి. తన ప్రేమ విషయం ముందు రోజా వాళ్లింట్లో చెప్పి అక్కడ ఒప్పుకున్న తర్వాత రోజాకు చెప్పి ఒప్పించాడట. ఇలా సెల్వమణి తన ప్రేమ గురించి రోజాకి చెప్పిన పది సంవత్సరాలకి ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇవివి సత్యనారాయణ సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పాడు. ఆమె ఒప్పుకుంది..


ఆ తర్వాత పదేళ్లకు అంటే 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీళ్లకు ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు.. ఓ అమ్మాయి, అబ్బాయి..తమ దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు, కలహాలు లేకుండా హాయిగా ముందుకు సాగుతున్నారు రోజా సెల్వమణి. భర్తగా సెల్వమణి తన జీవితంలో ప్రవేశించడం  తన అదృష్టం అని చాలాసార్లు చెప్పుకొచ్చింది రోజా. ఏదేమైనా రోజా సెల్వమణి ఇద్దరు చాలా గ్రేట్. e కాలం ప్రేమికులకు ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. ముందు ప్రేమించిన వాళ్లకు చెప్పి.. ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే గొడవ చేసి పెళ్లి చేసుకునే కంటే   ముందుగానే పెద్దలను ఒప్పించి ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయికి చెప్పి ఆమెను ఒప్పించడం గ్రేట్ కదా...అన్ని అలోచించి కెరీర్ ను ప్లాన్ చేసుకుని మరి వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది నిజగా అభినందదాయకం. అందుకే వీళ్ళ కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది.. !!


టీడీపీ నేత‌ల స్వార్థ రాజ‌కీయాల‌కు పార్టీ బ‌లి...!

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>