PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deceise06feb424-9e09-4b0a-9963-e19d2b6903ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deceise06feb424-9e09-4b0a-9963-e19d2b6903ca-415x250-IndiaHerald.jpgదేశంలో 2020 సంవత్సరంలో ప్రజలను కొత్త వ్యాధులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది నెలల క్రితం నుంచి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.deceise;kerala;godavari river;district;west godavari;2020;minister;eluru;vదేశంలో మరో కొత్త వ్యాధిదేశంలో మరో కొత్త వ్యాధిdeceise;kerala;godavari river;district;west godavari;2020;minister;eluru;vSat, 12 Dec 2020 07:52:22 GMTదేశంలో మరో కొత్త వ్యాధి

దేశంలో 2020 సంవత్సరంలో ప్రజలను కొత్త వ్యాధులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది నెలల క్రితం నుంచి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

ఇప్పటికే ఈ వ్యాధుల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా మరో కొత్తరకం వ్యాధి ప్రజలను మరింత టెన్షన్ పెడుతోంది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజానాథ్ ఆ రాష్ట్రంలో కొత్తరకం మలేరియాను గుర్తించినట్టు వెల్లడించారు. సాధారణ మలేరియాలతో పోల్చి చూస్తే ఈ వ్యాధి భిన్నమని ప్లాస్మోడియం ఒవాల్ అనే పరాన్నజీవి వల్ల అరుదైన మలేరియా వస్తున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు, వైద్యులు తెలుపుతున్నారు.

వైద్యులు సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తి కొత్తరకం మలేరియా బారిన పడినట్టు గుర్తించగా అతను ప్రస్తుతం కన్నూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మలేరియా ప్రాణాంతకం కాకపోయినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ వ్యాధి వ్యాప్తి జరగకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తరకం వ్యాధులు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మన దశంలో ఈ వ్యాధి కేసులు మొదటిసారిగా నమోదైనా ఇతర దేశాల్లో మాత్రం ఈ వ్యాధి సాధారణమైన వ్యాధి అని.. వ్యాధి వ్యాప్తిని సకాలంలో చికిత్స, నివారణ చర్యల అడ్డుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల వ్యాధిని అరికట్టడం సాధ్యమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>