MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adanta-rajinikanth-period-19801eb18c3d-b6b4-4b6a-b87f-17860414358b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/adanta-rajinikanth-period-19801eb18c3d-b6b4-4b6a-b87f-17860414358b-415x250-IndiaHerald.jpg1980ల నాటికి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ అగ్రశ్రేణి నటుడిగా ప్రాచుర్యం పొందితే, 1980లో వచ్చిన అమితాబ్ నటించిన డాన్ రీమేక్ బిల్లా చిత్రం రజనీని ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా బాక్పాఫీసు సాక్షిగా నిరూపించి, సరికొత్తచరిత్రకు శ్రీకారం చుట్టింది. చాలా సంవత్సరాలు బిల్లా చిత్రమే రజనీ కెరీర్లో అతిపెద్ద బాక్సాఫీసు హిట్ గా రికార్డు నెలకొల్పింది. కానీ 1990 తర్వాతి దశను రజినీకాంత్ ప్రపంచంగానే పిలవాలి. adanta rajinikanth period 1980;amitabh bachchan;rajinikanth;deva;jeevitha rajaseskhar;shankar;tiru;korea, south;cinema;telugu;baba bhaskar;rajani kanth;festival;tamil;remake;tamilnadu;tsunami;indian;kabaliఅదంతా రజినీకాంత్ కాలం..!అదంతా రజినీకాంత్ కాలం..!adanta rajinikanth period 1980;amitabh bachchan;rajinikanth;deva;jeevitha rajaseskhar;shankar;tiru;korea, south;cinema;telugu;baba bhaskar;rajani kanth;festival;tamil;remake;tamilnadu;tsunami;indian;kabaliSat, 12 Dec 2020 22:32:50 GMT సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ అగ్రశ్రేణి నటుడిగా ప్రాచుర్యం పొందితే, 1980లో వచ్చిన అమితాబ్ నటించిన డాన్ రీమేక్ బిల్లా చిత్రం రజనీని ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా బాక్పాఫీసు సాక్షిగా నిరూపించి, సరికొత్తచరిత్రకు శ్రీకారం చుట్టింది. చాలా సంవత్సరాలు బిల్లా చిత్రమే రజనీ కెరీర్లో అతిపెద్ద బాక్సాఫీసు హిట్ గా రికార్డు నెలకొల్పింది. కానీ 1990 తర్వాతి దశను రజినీకాంత్ ప్రపంచంగానే పిలవాలి.

బాషా, అరుణాచలం, ముత్తు వంటి సినిమాలతో తమిళ సినీరంగ జగత్తులో రజినీకాంత్ విశ్వరూపం ప్రదర్శించారు. ప్రతీ చిత్రం ఓ పెద్ద సంచలనం.. వసూళ్ళైతే సునామీలే. పలు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు.. అనువాదాలతో తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు రజనీకాంత్. పెదరాయుడు లాంటి సినిమాలతో అదరహో అనిపించాడు.

2010 సంవత్సరం మొత్తం భారతీయ చిత్రపరిశ్రమకే ఒక మేలుకొలుపు. రజినీ హీరోగా దర్శకుడు శంకర్ తీసిన రోబో..ఎవ్వరూ అందుకోలేని సమున్నత శిఖరాలపై రజినీని నిలబెట్టింది. భారతీయ ఉపఖండంలో వసూళ్ల సునామీ సృష్టించింది. అత్యంత ఖరీదైన చిత్ర నిర్మాణ విలువలతో తెరకెక్కిన రోబో,  భారీ వసూళ్ళను రాబట్టిన తొలిచిత్రంగా రికార్డులకెక్కింది.

రజినీ సినిమా విడుదలవుతుందంటే.. తమిళనాడులో పండుగ వాతావరణం ఉంటుంది. కబాలి సినిమా సందర్భంగా.. ఏకంగా విమానాలపైనే పోస్టర్లు వెలిశాయి. సినీ చరిత్రలో తొలిసారిగా ఎయిర్‌ ఆసియా ప్రత్యేకంగా తమ విమానాలకు కబాలీ సినిమా పోస్టర్లతో సందడి చేసింది.

సినిమా జీవితంలో స్టార్‌డమ్ చూసిన రజినీకాంత్‌.. ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక వాదిగా మారిపోయారు. ఏటా పదిహేను రోజుల పాటు హిమాలయాలకు వెళ్లి, అక్కడ యోగసాధన చేస్తుంటారు. ప్రయాణం తర్వాత అక్కడి ఫోటోలను.. అభిమానులతో పంచుకుంటారు. అరుణాచలం సినిమాతో మొదలైన ఆద్యాత్మిక పంథా ఆ తర్వాత వచ్చిన బాబా సినిమాతో పూర్తిస్థాయిలో ఆవిష్కృతమైంది. అప్పటి నుంచి దేవుడు ఆదేశిస్తే రజినీ పాటిస్తాడంటూ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానుల నుంచి ఒత్తిడి ఉన్నా.. ఆ దిశగా ఆలోచించలేదు రజినీకాంత్. కానీ తమిళనాట ఏర్పడిన శూన్యతతో ... రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. . రజనీ రాజకీయ ప్రకటనతో అభిమానులు కేరింతలు కొడుతుంటే, ప్రత్యర్ధులకు మాత్రం ముచ్చెమటలు పోస్తున్నాయి.సినీజగత్తులో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందుతున్న రజినీ.. రాజకీయ రంగంలోనూ తనదైన మార్కు వేస్తారని అభిమానులు, కేడర్ చెబుతోంది..


ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>