PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr03f299a7-0ee3-4a1c-a756-779fe265cd1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr03f299a7-0ee3-4a1c-a756-779fe265cd1e-415x250-IndiaHerald.jpg తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రితో కేసీఆర్ సమావేశం కావడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో సయోధ్యకు సంబంధించిన అంశాలపైనే అమిత్ షాతో గులాబీ బాస్ మాట్లాడారని చెబుతున్నారు. అమిత్‌షాతో సీఎం కేసీఆర్‌ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు.kcr;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;india;telangana;hosta;amith shah;congress;rayalaseema;chief minister;cbi;minister;aqua;letter;central government;european union;custard apple;dookudu;mantraఅమిత్ షాతో కేసీఆర్ చర్చలేంటీ!అమిత్ షాతో కేసీఆర్ చర్చలేంటీ!kcr;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;india;telangana;hosta;amith shah;congress;rayalaseema;chief minister;cbi;minister;aqua;letter;central government;european union;custard apple;dookudu;mantraSat, 12 Dec 2020 10:24:25 GMT  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రితో కేసీఆర్ సమావేశం కావడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో సయోధ్యకు సంబంధించిన అంశాలపైనే అమిత్ షాతో గులాబీ బాస్ మాట్లాడారని చెబుతున్నారు. అమిత్‌షాతో సీఎం కేసీఆర్‌ దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీకి 2014 నుంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది టీఆర్‌ఎస్. అయితే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ పెరిగింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడం ద్వారా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారని.. అందుకే అమిత్ షాతో సమావేశం అయ్యారని  రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేసీఆర్ , అమిత్ షా భేటీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. బీజేపీతో డీల్ కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు.మొదటి నుంచి బీజేపీతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం వ్యతిరేకంగా ఉన్నట్లు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ డ్రామాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపిచ్చిన భారత్ బంద్ కు సపోర్ట్ చేసిన కేసీఆర్.. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న అన్నదాతలను కలిసి ఎందుకు సంఘీభావం చెప్పలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపించిన తెలంగాణ బీజేపీ నేతలు.. సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
     
  అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం రాష్ట్ర సమస్యలపైనే కేంద్ర మంత్రులతో కేసీఆర్ మాట్లాడారని చెబుతున్నారు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ కు తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు సాయం అందించాలని అమిత్ షాను కోరినట్లు చెబుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో  తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థించారని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు సహా ఇటీవలి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ తరపున లేవనెత్తిన అంశాల్లో కొన్నింటిని మరోసారి కేంద్ర మంత్రి వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.


సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>