PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrcomplaintcentralgovernment856a746b-edea-4e82-84ed-f39cc605908c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrcomplaintcentralgovernment856a746b-edea-4e82-84ed-f39cc605908c-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బీజీగా మారారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులతో సమావేశమైన ఆయన ప్రధాని మోడీని కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. దీంతో శనివారం, ఆదివారం ఢిల్లీలోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కృష్ణ జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విషయాన్ని కేసీఆర్ కేంద్ర పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తోంది.kcr;modi;amit shah;kcr;krishna;nithya new;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;telangana;narendra modi;rayalaseema;prime minister;chief minister;minister;central government;party;mantra;narendraజగన్ పై కేసీఆర్ ఫిర్యాదుజగన్ పై కేసీఆర్ ఫిర్యాదుkcr;modi;amit shah;kcr;krishna;nithya new;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;jagan;andhra pradesh;telangana;narendra modi;rayalaseema;prime minister;chief minister;minister;central government;party;mantra;narendraSat, 12 Dec 2020 07:57:58 GMT

జగన్ పై కేసీఆర్ ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బీజీగా మారారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులతో సమావేశమైన ఆయన ప్రధాని మోడీని కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. దీంతో శనివారం, ఆదివారం ఢిల్లీలోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కృష్ణ జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన విషయాన్ని కేసీఆర్ కేంద్ర పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

కృష్ణ నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు వచ్చే సమస్యలపై ఏపీ సీఎం జగన్ పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ఫిర్యాదు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేసీఆర్ కోరిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఆ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన కేసీఆర్ ఆయనను షాలువాతో కప్పి సన్మానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించారు. అలాగే పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని నేడు కలువనున్నారు. అయితే వెంటవెంటనే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకడంతో కేసీఆర్ బిజీగా మారారు.

నేడు, రేపు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకగానే ఆయనతో పలు విషయాలు చర్చించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును టీఆర్ఎస్ వ్యతిరేకించించింది. రాజ్యసభలో తమ పార్టీ సభ్యులతో కేసీఆర్ వ్యతిరేక ఓటు వేయించారు. మరోవైపు రైతులు చేస్తున్న ఉద్యమానికి కేసీఆర్ మద్దతు తెలిపారు. వారు తలపెట్టిన బంద్ లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ పెద్దలనందరికీ కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనపై కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం చెబుతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>