PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay6d99b226-e0bc-4de8-877f-9356133efe29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay6d99b226-e0bc-4de8-877f-9356133efe29-415x250-IndiaHerald.jpgఅధికారానికి దగ్గరయ్యేందుకు తెలంగాణ బిజెపి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న రాజకీయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బిజెపి బలం పుంజుకోవడం బాగా వర్కౌట్ అయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం బలం , బలహీనత లను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తీరు సక్సెస్ అవడంతో ,అధిష్టానం పెద్దలు సైతం సంజయ్ కు అన్ని రకాలుగా ను మద్దతు ఇస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల తంతు ముగియడంతో ఇప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. దీనిలో భbandi sanjay bjp telangana tngo employees swamy go;auto;varsha;hyderabad;bharatiya janata party;india;telangana;letter;successఉద్యోగ సంఘాల పై సంజయ్ తిట్ల వర్షం ? అదిరిపోయే స్కెచ్ ?ఉద్యోగ సంఘాల పై సంజయ్ తిట్ల వర్షం ? అదిరిపోయే స్కెచ్ ?bandi sanjay bjp telangana tngo employees swamy go;auto;varsha;hyderabad;bharatiya janata party;india;telangana;letter;successSat, 12 Dec 2020 09:00:00 GMTఅధికారానికి దగ్గరయ్యేందుకు తెలంగాణ బిజెపి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న రాజకీయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బిజెపి బలం పుంజుకోవడం బాగా వర్కౌట్ అయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం బలం , బలహీనత లను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన తీరు సక్సెస్ అవడంతో ,అధిష్టానం పెద్దలు సైతం సంజయ్ కు అన్ని రకాలుగా ను మద్దతు ఇస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల తంతు ముగియడంతో ఇప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వారిపై అనేక ఆరోపణలు చేస్తూ , ఉద్యోగులోనూ తీవ్ర చర్చ జరిగే విధంగా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. 




తాజాగా ఉద్యోగ సంఘాలు భారత్ బంద్ కు మద్దతు తెలియజేసిన అప్పటి నుంచి బిజెపి టీ ఎన్జీవో నేతలను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది. అసలు ఉద్యోగ సంఘాలు బంద్ లో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యల కు ఉద్యోగ సంఘాలకు సంబంధం ఏమిటని బిజెపి ప్రశ్నిస్తోంది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా, ఉంచుకున్నోళ్లు పెంచు కున్నోళ్ల కోసం జీవోలు తెచ్చుకుంటున్నారని టీ ఎన్జీవో నేతలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు అడ్డంపెట్టుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారి సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చేశారు. అయితే టీఎన్జీవో నేతలపై ఒక్కసారిగా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు గతంలో ఈ విధంగా విమర్శలు చేయలేదు. వారి మద్దతు కోసం ప్రయత్నించేవారు. దీనికి కారణం తెలంగాణ లో ఉద్యోగ సంఘాల పాత్ర ఎక్కువగా ఉండటం, ఎన్నికలలో గెలుపొందారు అంటే వారి మద్దతు తప్పనిసరిగా కావాల్సి రావడం వంటి వాటితో వారి మద్దతు కోసం పార్టీలు ప్రయత్నించే వారు కానీ ఇప్పుడు బండి సంజయ్ వారిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని సర్వత్రా ఆశ్చర్యం, ఆసక్తి నెలకొన్నాయి. 




దీనికి కారణం గతంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన స్వామి గౌడ్ ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. స్వామి గౌడ్ ద్వారా టీఎన్జీవో సంఘంలో చీలిక తెచ్చే విధంగా బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమవుతుంది. స్వామి గౌడ్ మాత్రమే కాకుండా ఉద్యోగ సంఘాల మాజీ నేత దీనికి సహకారం అందిస్తూ ఉండడంతో వారిద్వారా ఉద్యోగులను ఆకర్షించి టీఎన్జీవో లో చీలిక తీసుకువచ్చి టిఆర్ఎస్ కు వారి మద్దతు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక టీఎన్జీవో నేతలపై ఉద్యోగస్తుల్లోనూ అసంతృప్తి ఉన్న విషయాన్ని బిజెపి గుర్తించింది. ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర బలంగా వాదించడం లేదని , ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని చాలా కాలంగా ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి అసంతృప్తులను గుర్తించే బండి సంజయ్ వంటివారు టీఎన్జీవో నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ, ఉద్యోగ సంఘాలలో చీలిక తెచ్చే విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు.



ఎన్నారై నర్సులను పిలుస్తున్న ఇండియా

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>