SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishab-played-very-well-in-match244772ca-e0b6-4b5d-b7c2-dbcee79d378b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ స్పోర్ట్స్ న్యూస్ చదవండి.. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు పాలవుతూ టీమిండియాలో స్థానం కోసం సతమతమవుతున్న రిషబ్ పంత్ ఈసారి దుమ్మురేగిపోయే ఆట ఆడి మెప్పించాడు.ఆస్ట్రేలియాపై టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయి ఆడాడు.ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ లో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 73 బంతుల్లోనే 9 ఫోర్లు, ఆరు సిక్సర్లు సాయంతో 103 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్‌ని వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద ఎదురrishab-pant;sports;audi;india;australia;rishabh pant;letter;mayank agarwal;paruguవిధ్వంసం సృష్టించిన పంత్....విధ్వంసం సృష్టించిన పంత్....rishab-pant;sports;audi;india;australia;rishabh pant;letter;mayank agarwal;paruguSat, 12 Dec 2020 21:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ స్పోర్ట్స్ న్యూస్ చదవండి.. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు పాలవుతూ టీమిండియాలో స్థానం కోసం సతమతమవుతున్న రిషబ్ పంత్ ఈసారి దుమ్మురేగిపోయే ఆట ఆడి మెప్పించాడు.ఆస్ట్రేలియాపై  టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  బ్యాటింగ్‌తో  చెలరేగిపోయి ఆడాడు.ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ లో  జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 73 బంతుల్లోనే 9 ఫోర్లు, ఆరు సిక్సర్లు  సాయంతో 103 పరుగులు చేశాడు.


మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్‌ని వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద ఎదుర్కొన్న రిషబ్ పంత్.. ఆ ఓవర్‌లో ఆఖరి ఐదు బంతుల్ని 4,4,6,4,4 లు కొట్టి సెంచరీని చేశాడు. తన మునుపటి వైభవాన్ని మళ్ళీ చూపించాడు.. ఆసీస్ ఫాస్ట్ బౌలర్  జాక్  చివరి ఓవర్‌లో మొదటి బంతిని ఫుల్ చేసేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించగా.. బంతి అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. కానీ.. ఆ తర్వాత మాత్రం సాహసోపేతంగా వరుసగా ఫుల్ షాట్‌లు ఆడేసిన పంత్.. ముచ్చటైన కవర్ డ్రైవ్‌తోనూ ఆకట్టుకున్నాడు.


99 పరుగుల వద్ద చివరి బంతిని ఫుల్ టాస్ రూపంలో జాక్ విసరగా.. మిడ్ వికెట్ దిశగా గ్యాప్‌లో హిట్ చేసిన పంత్.. సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. రిషబ్ పంత్‌తో పాటు హనుమ విహారి (104 బ్యాటింగ్: 194 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ బాదడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 386/4తో నిలిచింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (61), శుభమన్ గిల్ (65) కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ప్రస్తుతం టీమిండియా 472 పరుగుల ఆధిక్యంలో  వుంది.ఇలాంటి మరెన్నో క్రీడా వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో క్రీడా వార్తలు గురించి తెలుసుకోండి...


తెలంగాణలో 6 ఎయిర్ పోర్టులకు అనుమతివ్వండి

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>