PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi0da23629-9d25-4a52-9f2a-f3ae07c36655-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi0da23629-9d25-4a52-9f2a-f3ae07c36655-415x250-IndiaHerald.jpgరైతుల ఆదాయం పెంచడానికే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు కొత్త సాగు చట్టాలతో తొలగిపోయాయన్నారు ప్రధాని.modi;auto;modi;delhi;apple;narendra modi;east;prime minister;minister;letter;central government;european union;custard apple;narendraరైతుల ఆదాయం పెంచేందుకే కొత్త చట్టాలు- ప్రధాని నరేంద్ర మోడీరైతుల ఆదాయం పెంచేందుకే కొత్త చట్టాలు- ప్రధాని నరేంద్ర మోడీmodi;auto;modi;delhi;apple;narendra modi;east;prime minister;minister;letter;central government;european union;custard apple;narendraSat, 12 Dec 2020 13:30:49 GMT రైతుల ఆదాయం పెంచడానికే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు కొత్త సాగు చట్టాలతో తొలగిపోయాయన్నారు ప్రధాని. కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్నామ్నాయాలను వెతుక్కొవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 కొత్త చట్టాలతో  రైతులు తామ పండించిన పంటలను మార్కెట్లు లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోడీ చెప్పారు. దేశ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను ఆధునికీకరిస్తామని తెలిపారు. కొత్త చట్టాలతో  భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు.  రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. 

 మరోవైపు రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. దీంతో ఢిల్లీ  సరిహద్దులో నిరసన తెలుపుతున్న  రైతుల సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది.  ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాతనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని, ఇవి కచ్చితంగా రైతుల జీవితాల్లో మార్పు తెస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే  చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ అంగీకరించబోమని రైతు సంఘాలు తేల్చి చెబుతున్నాయి.



రైతుల నిరసనలు షురూ

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>