Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/beware-of-corona-if-you-belong-to-these-5-dna-models8f7f92d8-51e7-4b61-aec8-37b576bfbe2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/beware-of-corona-if-you-belong-to-these-5-dna-models8f7f92d8-51e7-4b61-aec8-37b576bfbe2b-415x250-IndiaHerald.jpgప్రపంచమే కరోనాతో వణికిపోతోంది. అయితే ఈ కరోనా వల్ల మిగతావారితో పోల్చితే కొన్ని రకాల డీఎన్ఏ గ్రూపులు ఉన్నవారి మరింత భయపడాలని నిపుణులు చెబుతున్నారు. అసలు కరోనా తీవ్రత ఎవరిలో ఎక్కువగా ఉంటోంది? అనే విషయంపై ఇటీవల ఓ సంస్థ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా తీవ్రత అందరిపై...corona dna;american samoa;kanna lakshminarayana;dnaఆ డీఎన్‌ఏ కలవారిపై కరోనా దాడి అత్యధికం.. పరిశోధనల్లో వెల్లడి!ఆ డీఎన్‌ఏ కలవారిపై కరోనా దాడి అత్యధికం.. పరిశోధనల్లో వెల్లడి!corona dna;american samoa;kanna lakshminarayana;dnaSat, 12 Dec 2020 11:39:46 GMTడీఎన్‌ఏ ఆధారంగా కరోనా తీవ్రత ఎలా ఉంటుందనే అంశంపై పరిశోధన చేసిన సంస్థ.. ఐఎఫ్ఎన్ఏఆర్2, టీవైకే2, ఓఏఎస్1, డీపీపీ9, సీసీఆర్2.. అనే ఐదు వర్గాలకు చెందిన జీన్స్ కలిగి ఉన్న వారిపై కరోనా మహమ్మారి తీవ్రత అత్యధికంగా ఉంటోందని, వారు కరోనా బారినపడితే పరిస్థితి చేయి దాటిపోతోందని వెల్లడించారు.

‘కరోనాకు మన శరీరంలోని జీన్స్‌కు అవినాభావ సంబంధం ఉంది. మా పరిశోధన ఫలితాలను బట్టి ఎవరికి కరోనా త్వరగా సోకుతుంది..? వారిని ఎలా కాపాడాలి..? అందుకోసం ఏ కంపెనీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది..? అనే అంశాలపై పూర్తి క్లారిటీ వస్తుంద’ని పరిశోధనలో పాల్గొన్న సదరు కంపెనీ చెబుతోంది. ఈ పరిశోధన వల్ల కరోనా పేషెంట్లకు, అలాగే రీసెర్చర్లు కరోనా వ్యాక్సిన్ తయారీలోగానీ, అలాగే పేషెంట్ల చికిత్సలోకానీ చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వివరిస్తోంది.

తాజా పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ మెడికల్ జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఈ కథనం ప్రకారం, కరోనా పేషెంట్‌కు పరిస్థితిని అంచనా వేయొచ్చట. ఇలాంటి సందర్భాల్లో ఫైజర్ టీకా కన్నా కూడా ఎలీ లిల్లీ కంపెనీ తయారు చేసిన బారిసిటినిబ్ డ్రగ్ ఉపయోగపడుతుందట. కాగా, శరీరంలో యాంటీబాడీలను వృద్ధి చేయడం కోసం ఎలీ లిల్లీ అభివృద్ధి పరచిన బామ్మానివిమాబ్ అనే డ్రగ్స్‌కు అమెరికా నుంచి ఇప్పటికే అనుమతి కూడా లభించింది.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారిని నిర్మూలించాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఆయా దేశాల్లోని చిన్న, పెద్ద ఫార్మా కంపెనీలన్నీ వ్యాక్సిన్ కనుక్కోవడంలో తలమునకలవుతున్నాయి.  ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు తాము కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశామని ప్రకటించుకుంటున్నాయి. వాటి అనుమతి కోసం తమ దేశంతో పాటు పక్క దేశాలతో కూడా మంతనాలు జరుపుతున్నాయి.  ఈ విషయాన్ని ఆ కంపెనీలే ప్రకటించుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్ వినియోగ అనుమతి కోసం అనేక దేశాల రెగ్యులేటరీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని, అయితే సదరు దేశాల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావల్సి ఉందని చెబుతున్నాయి. 


వికారాబాద్ లో అమానుషం తాగిన మైకంలో కూతుర్ని చంపేసిన తల్లి

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>