MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla06d8d765-d0d1-4d39-8e08-d4efeb26a16a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla06d8d765-d0d1-4d39-8e08-d4efeb26a16a-415x250-IndiaHerald.jpgకడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం..వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. అయితే కాంగ్రెస్-టీడీపీల నుంచి ఇద్దరు నేతలు దశాబ్దాల పాటు ప్రత్యర్ధులుగా తలపడుతూ వచ్చారు. 1983 నుంచి కాంగ్రెస్ తరుపున డి‌ఎల్ రవీంద్రా రెడ్డి, టీడీపీ నుంచి శెట్టిపల్లి రఘురామిరెడ్డి బరిలో ఉండేవారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో డి‌ఎల్ గెలిస్తే, 1985, 1999 ఎన్నికల్లో శెట్టిపల్లి గెలిచారు. ysrcp mla;raghu;sudhakar;y. s. rajasekhara reddy;congress;2019;district;kadapa;government;mla;cheque;aqua;tdp;reddy;mydukur;party;tirumala tirupathi devasthanamహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాజీ టీటీడీ అధ్యక్షుడుకు చెక్ పెట్టేసిన సీనియర్ ఎమ్మెల్యే...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాజీ టీటీడీ అధ్యక్షుడుకు చెక్ పెట్టేసిన సీనియర్ ఎమ్మెల్యే...ysrcp mla;raghu;sudhakar;y. s. rajasekhara reddy;congress;2019;district;kadapa;government;mla;cheque;aqua;tdp;reddy;mydukur;party;tirumala tirupathi devasthanamFri, 11 Dec 2020 05:00:00 GMTకడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం..వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే. అయితే కాంగ్రెస్-టీడీపీల నుంచి ఇద్దరు నేతలు దశాబ్దాల పాటు ప్రత్యర్ధులుగా తలపడుతూ వచ్చారు. 1983 నుంచి కాంగ్రెస్ తరుపున డి‌ఎల్ రవీంద్రా రెడ్డి, టీడీపీ నుంచి శెట్టిపల్లి రఘురామిరెడ్డి బరిలో ఉండేవారు. 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో డి‌ఎల్ గెలిస్తే, 1985, 1999 ఎన్నికల్లో శెట్టిపల్లి గెలిచారు.

ఇక 2014 నుంచి పరిస్తితి మారిపోయింది. అదే శెట్టిపల్లి వైసీపీలోకి వచ్చి వరుసగా విజయం సాధిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఓడిపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో సుధాకర్ టీటీడీ ఛైర్మన్‌గా చేసిన విషయం తెలిసిందే. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా శెట్టిపల్లి నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు కార్యక్రమం విజయవంతంగా అమలైంది. ఇంకా నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అయితే అభివృద్ధి పెద్దగా జరగడం లేదు. గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండటంతో పుట్టా సుధాకర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన కూడా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు  జరగలేదు. ఇక్కడ తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మైదుకూరు పట్టణంలో పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయి.    

పార్టీల పరంగా చూసుకుంటే మైదుకూరులో వైఎస్సార్‌సీపీ బాగా బలంగా ఉంది. ఆ బలాన్ని తగ్గించేందుకు టీడీపీ నేత పుట్టా సుధాకర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే శెట్టిపల్లి బలంగా ఉండటంతో పాటు నియోజకవర్గంపై పట్టున్న డీఎల్ వైఎస్సార్‌సీపీ వైపు ఉండటం ఇంకా కలిసొచ్చే అంశం. కాబట్టి మైదుకూరులో వైఎస్సార్‌సీపీకి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు.




ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>