Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanid8ae1f39-5445-4515-b159-b93e0c5cf29b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanid8ae1f39-5445-4515-b159-b93e0c5cf29b-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నానీ డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌తో ఆరునెలలుగా చేస్తున్న మంతనాలు ఎట్టకేలకు ముగిసాయి. వచ్చే ఏడాది చివరి నుంచి తన డిజిటల్ కెరీర్‌ను నాని మొదలు పెట్టనున్నాడు. నానీ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితుడే. తనదైన నటనతో చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.nani;nani;shiva;shyam;cinema;lord siva;kusuma jagadish;tuck jagdish;tuck jagadishనానీ డిజిటల్ ఎంట్రీకి అంతా రెడీనానీ డిజిటల్ ఎంట్రీకి అంతా రెడీnani;nani;shiva;shyam;cinema;lord siva;kusuma jagadish;tuck jagdish;tuck jagadishFri, 11 Dec 2020 11:29:29 GMTనాని మొదలు పెట్టనున్నాడు. నానీ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితుడే. తనదైన నటనతో చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇటీవల నానీ ఓటీటీ వేదికగా విడుదల చేసిన వీ చిత్రం అనుకున్నంత స్థాయిలో రాణిచంలేకపోయినా నానీ తన జోష్‌ మాత్రం తగ్గించకుండా వరుస సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు.
 వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళ్తున్నాడు. ’వీ‘ సినిమా తరువాత టక్ జగదీష్ సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యేసరికి శామ్ సింగరాయ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిపాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలయింది. వీటితో పాటు ఇటీవల ‘అంటే సుందరానికి’ అంటూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు పట్టాలెక్కెశాయి. ఇంతలో అభిమానులకు మరో తీపు కబురు వినిపించాడు. తన డిజిటల్ ఎంట్రీ ఖరారు అయిందనే వార్తను వినిపించాడు. నెట్ ఫ్లిక్స్‌తో మంతనాలు జరిపి దీనిని ఖరారు చేశాడు.
అంటే ఇకపై నాని కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ కనిపించనున్నాడు. ఈ డిజిటల్ ఎంట్రీ కోసం దాదాపు ఆరు నెలలుగా మంతనాలు కొనసాగించారు. ఎట్టకేలకు దాన్ని విజయవంతంగా అందుకున్నాడు. అయితే నాని చేస్తున్న టక్ జగదీష్ సినిమా శివ మోక్షం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయనున్నారు. శ్యామ్ సింగరాయ్ కూడా వచ్చే ఏడాది వేసవి తరువాత విడుదలకు సిద్దమవుతోంది.
 అదే విధంగా వచ్చే ఏడాది క్రస్మస్‌కు అంటే సుందరానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా నాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక నెట్‌ఫ్లక్స్ వెబ్ సిరీస్‌లో కనిపించేందుకు సిద్దమవుతున్నాడు. మరి నాచురల్ స్టార్ వెండితెరతో పాటు డిజిటల్‌గా కూడా ప్రేక్షకులను అలరించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.


శృంగారం గురించి భయం పోగొట్టేందుకు.. నడుం బిగించిన మహిళలు

పీసీసీ రాకుంటే బీజేపీలో చేరేందుకు సిద్దమైన కోమటిరెడ్డి?

13 వారాలు..13 ట్విస్టులు..అస్సలేం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో

ఫైజర్, బయో ఎన్ టెక్ కరోనా వ్యాక్సిన్ డేటా చోరీ!

బిగ్‌బాస్4 చివరి వారంలో కూడా ఏంటీ గొడవలు?

ఆ అధికారికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతున్న ఏపీ ప్రభుత్వం!

బీజేపీ నేతలను ఏకిపారేసిన దీదీ మమతా బెనర్జీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>